
కారులో అకస్మాత్తుగా నాగు పాము కనిపించడంతో అందులో ప్రమాణిస్తున్న వారి వెన్నులో వణుకు పుట్టింది. కారులో పాటు కనిపించడంతో వాహనాన్నిఅక్కడే ఆపి చిన్నారితో సహా దంపతులు బయటకు పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా, తొండుపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో పాము ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు స్నేక్ క్యాచ్ ర్ కు సమాచారమందించారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న వారు పామును పట్టుకున్నారు. దీంతో కారులో వెళుతున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.