
ప్రస్తుతం ఇండియా మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది. సినీ ప్రముఖులంతా షూటింగ్స్ మానుకొని ఎవరింట్లో వాళ్ళు రిలాక్స్ గా ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా తన ఇంట్లోనే ఉంటుంది. ఇల్లు అంటే చెన్నైలో కమల్ హాసన్ హౌస్ కాదు, తానూ హీరోయిన్ గా సంపాదించిన డబ్బులతో ముంబైలో ఒక ఫ్లాట్ కొనుక్కుంది.
ఇప్పుడు శృతి హాసన్ ఆ ప్లాట్ లోనే ఉంటుంది. ఒంటరిగా కాదు, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది. సహజంగా హీరోయిన్ల పై ఇలాంటి విషయాలు రూమర్స్ గా వస్తుంటాయి. కానీ శృతి హాసన్ ది బోల్డ్ మైండ్ కదా. చక్కగా తన బాయ్ ఫ్రెండ్ ‘శాంతను హజారికా’తో కలిసి తన ప్లాట్ లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చింది. పైగా తన బాయ్ ఫ్రెండ్ తో రకరకాల ఫోజులిస్తూ నవ్వుతూ ఫోటోలు తీసుకుంది.
ఆ ఫోటోలను అన్నిటిని కలిపి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘నా బాయ్ ఫ్రెండ్ తో ఇలా బందీ అయ్యాను’ అంటూ నర్మగర్భంగా అతనితో ఎంజాయ్ చేస్తున్నా అనే సెన్స్ వచ్చేలా ఒక మెసేజ్ పెట్టింది. ఏది ఏమైనా శృతి హాసన్ కి బాయ్ ఫ్రెండ్స్ విషయంలో అసలు మొహమాటం ఉండదు. అంతా ఓపెన్ గానే చెప్పేస్తోంది. వదిలేసిన మాజీ బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమె ఇలాగే చాల సార్లు ఒకే ప్లాట్ ఇంట్లో ఉంది. ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ తోనూ ఇలాగే కలిసే ఉంటుంది.