Nokia HMD vibe 2 Pro 5G: నోకియా ఫోన్లకు ఒకప్పుడు మన దేశం మార్కెట్లో మంచి గుర్తింపు ఉండేది.. ఇప్పుడు HMD బ్రాండ్ తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది నోకియా. ఇందులో HMD vibe 2 Pro 5G ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది.. 64 MP కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్ జెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు
- 6.78 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. ఇందులో 120 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్ నెస్.
- మీడియా టెక్ డైమన్ సిటీ 6300.. ప్రాసెసర్ ఇందులో ఉంది. రోజువారి పనులకు.. 5g కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుంది.
కెమెరా 64 మెగాపిక్సల్+ 2 మెగాపిక్సల్, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.. బ్యాటరీ 6000 ఎంఏ హెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ ఫోన్ లో 6.78 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉండడం ప్రధాన ఆకర్షణ. 120 హెచ్ జెడ్ రీ ఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియోలను చూడడం మరింత స్మూత్ గా ఉంటుంది. 800 నిట్స్ బ్రైట్నెస్ ఇందులో కనిపిస్తుంది. సాధారణ వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోన్లో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. టు మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. పగటిపూట సరైన వెలుతురులో మంచి ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆటో ఫోకస్ ఉపయోగకరంగా ఉంటుంది. 13 మెగాపిక్సల్ కెమెరా సాధారణ అవసరాలకు సరిపోయే అవకాశం ఉంది. దీని ధర మన దేశం మార్కెట్ 24,999 రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ విడుదలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
చాలా కాలం తర్వాత నోకియా ఫోన్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో యూజర్లలో భారీ అంచనాలున్నాయి. త్వరలో మార్కెట్ లోకి విడుదలకాబోతున్న నేపథ్యంలో ఈ ఫోన్ల విక్రయాల ఆధారంగా నోకియా తదుపరి మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్ ఫోన్లు అన్ని ఎంపిక చేసిన ఆన్ లైన్ విక్రయ కేంద్రాలలో లభిస్తాయని తెలుస్తోంది.