Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGmail: ఈమెయిల్ తప్పుగా పంపారా? ఏం పర్వాలేదు..ఈ సెట్టింగ్స్ ను మార్చుకోండి..

Gmail: ఈమెయిల్ తప్పుగా పంపారా? ఏం పర్వాలేదు..ఈ సెట్టింగ్స్ ను మార్చుకోండి..

Gmail: ప్రస్తుత కాలంలో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ జీమెయిల్ తప్పనిసరిగా ఉంటోంది. కొన్ని అవసరరాలకు ఇది ఉండాలి కూడా. అయితే మెయిల్ ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలపై అవగాహన ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేకమైన మెయిల్ సెండ్ చేసేటప్పుడు, లేదా రిసీవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అయితే జీమెయిల్‌లో ఈమెయిల్ పంపిన ప్రతిసారీ మనం తరచుగా Undo అని డిస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో […]

Gmail: ప్రస్తుత కాలంలో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ జీమెయిల్ తప్పనిసరిగా ఉంటోంది. కొన్ని అవసరరాలకు ఇది ఉండాలి కూడా. అయితే మెయిల్ ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలపై అవగాహన ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేకమైన మెయిల్ సెండ్ చేసేటప్పుడు, లేదా రిసీవ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అయితే జీమెయిల్‌లో ఈమెయిల్ పంపిన ప్రతిసారీ మనం తరచుగా Undo అని డిస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

జీమెయిల్ పంపేటప్పుడు Undo ఆప్షన్ స్క్రీన్‌పై కేవలం కొన్ని 5 సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తుంది. ఒక్కోసారి మెయిల్ పంపేటప్పుడు పొరపాట్లు చేయొచ్చు. తప్పుడు మెయిల్ పంపినా.. లేదా తప్పుడు ఫొటో పంపిన తరువాత నాలుక కరుచుకుంటాం. అయితే ఇలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వడానికి ఈ ఆప్షన్ ను తీసుకొచ్చారు. మిస్టేక్ ను సరిచేసుకోవడానికి 5 సెకన్ల టైం ఇస్తుంది. ఈ సమయంలో Undo పై క్లిక్ చేస్తే వెంటనే మెయిల్ సెండ్ కాదు. అక్కడే ఆగిపోతుంది.

అయితే జీమెయిల్ డిఫాల్ట్‌గా ఇచ్చిన 5 సెకన్ల సమయం అందరికి సరిపోకపోవచ్చు. ఈ సమయాన్ని పెంచుకునేందుకు జీమెయిల్ లో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. జీమెయిల్ సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేయడం ద్వారా ఈ క్యాన్సిలేషన్ సమయాన్ని పెంచుకోవచ్చు. దీని కోసం జీమెయిల్ General Settings లో ఉన్న Undo Send విభాగానికి వెళ్లాలి. అక్కడ Send cancellation period అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు 5, 10, 20, మరియు 30 సెకన్ల సమయ పరిమితులు అందుబాటులో ఉంటాయి.ఇక్కడ ఉన్న సమయాన్ని 30 సెకన్లకు మార్చుకొని పేజీ కింద ఉండే Save Changes పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ మారతాయి.

ఇలా పెంచుకోవడం వల్ల మెయిల్ పంపిన తర్వాత కూడా దాన్ని ఉపసంహరించుకోవడానికి మనకు సరిపడా సమయం లభిస్తుంది. తొందరపాటులో చేసే తప్పుల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న సెట్టింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper