spot_img
Homeబిజినెస్Top 5 electric scooters: మార్కెట్లో ఇప్పుడు ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 5 electric scooters: మార్కెట్లో ఇప్పుడు ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 5 electric scooters: వినియోగదారుల అభివృద్ధిలో మారుతుండడంతో ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటాలనే వాడుతున్నారు. కొన్ని కంపెనీలు వీటిని తక్కువ ధరకు అందించడంతోపాటు.. కావలసిన సౌకర్యాలను ఇస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు స్పోర్ట్స్ బైక్ లను అందించిన కంపెనీలు సైతం స్కూటర్ లనే ఎక్కువగా తీసుకువస్తున్నారు. అయితే ఏ కంపెనీ స్కూటర్ కొనాలని కొంతమందికి సందేహం ఉంటుంది. ఇలాంటి వారికి ప్రస్తుతం ఉన్న టాప్ స్కూటర్లు ఏవో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ టూవీలర్ కంపెనీ TVS మార్కెట్లోకి వచ్చిన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యధిక విక్రయాలు నమోదు చేసుకుంటుంది. ఈ స్కూటర్ ఈ ఏడాది మార్చిలో 49,453 యూనిట్ల విక్రయాలు చేసుకుంది. దీనిని రూ.1.61 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇందులో 5.3 కిలోవాట్ బ్యాటరీ ట్యాంక్ ఉండగా దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చే Ather నుంచి మార్కెట్లోకి వచ్చిన Rizta ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ఇందులో ఉండే ఫీచర్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్లో 4.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. దీనిని ఒక్కసారి చేస్తే 123 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో స్థిరత్వం కోసం స్పీడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే నేటితరం వినియోగదారులను ఆకట్టుకునేలా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, వాట్సాప్ ప్రివ్యూ, లైవ్ లొకేషన్, మ్యాజిక్ ట్విస్ట్ వంటి ఫీచర్లను చూడొచ్చు. దీనిని రూ.1.04 లక్షల ప్రారంభ ధరలతో విక్రయిస్తున్నారు.

Bajaj కంపెనీకి చెందిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా అవతరించి వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దీని డిజైన్ చూస్తే వెంటనే కొనాలని అనిపిస్తుంది. మిగతా స్కూటర్ల కంటే ఇది భిన్నంగా కనిపిస్తూ ప్రీమియం లుక్ ను అందిస్తుంది. అంతేకాకుండా దీని ధర మిగతా వాటికంటే తక్కువగానే ఉంటుంది. ఈ స్కూటర్లు రూ. 89,500 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

SUZUKI కంపెనీకి చెందిన యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్కు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.1.88 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్లో 3.07 బ్యాటరీ ప్యాక్ ఉండగా దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

OLA కంపెనీకి చెందిన S1 pro జెన్ 3 అనే స్కూటర్ కూడా అందరిని అలరిస్తోంది. ఇందులో 3 కిలో వాట్ బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ.1.02 లక్షలతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper