spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati environmental development: అమరావతికి పర్యావరణ శోభితం.. కొత్తగా ఆ చెట్లు

Amaravati environmental development: అమరావతికి పర్యావరణ శోభితం.. కొత్తగా ఆ చెట్లు

Amaravati environmental development: అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్.. అమరావతికి జాతీయ స్థాయిలో చట్టబద్ధత కల్పించిన తరువాత ప్రముఖ నగరాల జాబితాలో చేరుతోంది. అయితే కేవలం పాలనాపరమైన భవనాలే కాదు.. అన్ని కోణాల్లో అమరావతిని అగ్రగామిగా నిలపాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా అమరావతిని పర్యావరణహిత అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దేశీయ, విదేశాలకు చెందిన పలు వృక్షజాతులను అక్కడ పెంచి ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కాసియా ఫిస్టులా, గోల్డెన్ పవర్ ఫ్రీగా చెప్పుకునే ఓ మొక్కను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మరిన్ని మొక్కలను పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు అమరావతిలో. ఈ నేపథ్యంలో అరుదైన కాసియా ఫిస్టులా గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది.

పర్యాటకంగానూ..
అమరావతిని పర్యాటకంగా కూడా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో కాసియా ఫిస్టులా మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ అరుదైన మొక్కను రేలా అని, గోల్డెన్ పవర్ పిలుస్తుంటారు. అయితే ఈ మొక్కను పెంచడం అంత సులువు కాదు. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడితేనే దానిని పెంచడం సాధ్యం. అందుకే ప్రయోగాత్మకంగా పరిశీలించారు అధికారులు. రాయపూడి లోని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం బ్లాక్ 4 ఎదుట ప్రయోగాత్మకంగా కాసియా ఫిస్టులా మొక్కను నాటారు. అయితే ఈ మొక్క అమరావతి రాజధాని ప్రాంత వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగింది. తక్కువ కాలంలోనే ఎదిగింది.

అమరావతి వ్యాప్తంగా..
అందుకే ఇప్పుడు అమరావతి వ్యాప్తంగా కాసియా ఫిస్టులా మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన పసుపు రంగు పూలను ఇది ఇస్తుంది. అయితే అమరావతిలో పెంచిన మొక్క పసుపుతో పాటు తెలుపు రంగు కూడా పూయడం విశేషం. అందుకే రాజధాని వ్యాప్తంగా వీటిని పెంచేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. కాసియా ఫిస్టులా పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయిన నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో 40 కి పైగా కాసియా ఫిస్టులా మొక్కలను నాటి పెంచుతున్నారు. అయితే ఈ చెట్టు పర్యావరణ పరంగానే కాకుండా అనేక ఔషధ విలువలు కలిగి ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అధిక స్థాయిలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతుంది. వృద్ధాప్య నిరోధక చికిత్సలలో ఉపయోగిస్తారు.

సంవత్సరానికి రెండుసార్లు..
సాధారణంగా కాసియా ఫిస్టులా చెట్టు సంవత్సరానికి రెండుసార్లు పూలు పూస్తుంది. మార్చి, మే నెలల మధ్య ఎక్కువగా పూలు పూయనుంది. అక్టోబర్ తో పాటు నవంబర్లో రెండు నెలల పాటు పువ్వులు పూస్తాయి. అదే సమయంలో చెట్టు ఆకులు ఎక్కువగా రాలిపోతాయి. మొత్తం చెట్టును పువ్వులే ఆక్రమించి గుర్తులు గుత్తులుగా కిందకు వేలాడుతూ చూసేవారికి కొత్త అనుభూతిని ఇస్తాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper