Homeబిజినెస్Toyota Innova HyCross: 2 లక్షల యూనిట్ల విక్రయాలు దాటిన ఈ కారు ధర ఎంత...

Toyota Innova HyCross: 2 లక్షల యూనిట్ల విక్రయాలు దాటిన ఈ కారు ధర ఎంత అంటే..

Toyota Innova HyCross: కొందరికి హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని ఉంటుంది. మరికొందరికి SUV సెగ్మెంట్ పై ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు ఇష్టం లేనివారు MPV వెహికిల్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ సెగ్మెంట్లో కారులను తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా ఐ క్రాస్ అనే కారును మార్కెట్లోకి తీసుకురాగా.. రెండు సంవత్సరాల్లో 2 లక్షల […]

Toyota Innova HyCross: కొందరికి హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని ఉంటుంది. మరికొందరికి SUV సెగ్మెంట్ పై ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు ఇష్టం లేనివారు MPV వెహికిల్స్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ సెగ్మెంట్లో కారులను తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా ఐ క్రాస్ అనే కారును మార్కెట్లోకి తీసుకురాగా.. రెండు సంవత్సరాల్లో 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరుకొంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ కారుకు డిమాండ్ ఉన్నందుని దీని అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనికి పోటీగా ఎన్నో కార్లు వచ్చినా కూడా.. కిర్లోస్కర్ పై ఎక్కువగా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిస్టా సైతం అమ్మకాల్లో ముందంజలో దూసుకుపోతుంది. అయితే 2023 సంవత్సరంలో ఇన్నోవా క్రిస్టా 38,156 యూనిట్ల విక్రయాలు జరుపుకోవాలని.. ఇదే ఏడాదిలో ఇన్నోవా ఐక్రాస్ కిర్లోస్కర్ 45,916 కార్లను అమ్మింది. అయితే ఐక్రాస్ తో పోలిస్తే Crysta అమ్మకాలు తగ్గాయని చెప్పడం కంటే ఐక్రాస్ కిర్లోస్కర్ కారుపై ఎక్కువగా ఆదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు.

ఐక్రాస్ ఎక్కువగా అమ్మకాలు జరపడానికి ఇందులో ఉండే హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కారణమని తెలుస్తోంది. ఇది ఐదవ తరం సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ సిస్టంతో పనిచేస్తుంది. ఈ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా ఇది 186 పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితోపాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా రీఛార్జ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంది. దీంతో చాలామంది ఈ వ్యవస్థను చూసే ఈ కారును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నోవా ఐ క్రాస్ కారు టాక్సీ స్పేస్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ప్రీమియం కార్లలో ఉండే ఫీచర్లు ఉంటాయి. పవర్ తో కూడిన ఒట్టోమన్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సేఫ్టీ సెన్స్ ఎడిషన్ నువ్వు కలిగి ఉంది. అలాగే సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో చాలా వరకు ఉన్నాయి. గ్లోబల్ సేఫ్టీ టెస్టులో ఈ కారు 5 స్టార్ రేటింగ్ను పొందింది.

ఈ కారును.19.53 లక్షల తో విక్రయిస్తున్నారు. ఇందులో ఉండే బ్యాటరీని ఎనిమిది సంవత్సరాల వారంటీ అందిస్తున్నారు. ఈ కారణాలతోనే ఈ కారు ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా యూనిట్ల విగ్రహాలు జరుపుకుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper