Top 5 Cars
Top 5 Cars: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఇందుకు తగ్గట్లుగానే టెక్నాలజీ మారుతుండటంతో వెహికల్స్ లో ఫీచర్లు కూడా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కార్లు సైతం రోజుకో మోడల్ మార్కెట్ లోకి రావడంతో పాటు అందుకు తగ్గట్లుగానే ఫీచర్లు కూడా మారుతున్నాయి..
దేశంలో కార్ల వినియోగం కూడా పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.. సాధారణంగా ఎవరైనా కారును కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా చూసేది ధర, ఆ తరువాత మైలేజీ.. అయితే ఈ రెండు అంశాల్లోనూ దేశంలో టాప్ మోడల్ కార్లు నిలిచాయి. ఈ నేపథ్యంలో టాప్ -5 లో ఉన్న కార్లు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మారుతీ సుజుకీ సెలెరో.. దీని ప్రారంభ ధర రూ.5.36 లక్షలుగా ఉంది.. పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 26 kmpl గా ఉండగా సీఎన్జీ మైలేజీ 35.6 కి.మీ/కేజీగా ఉంది.
తరువాత మారుతీ సుజుకీ ఆల్టో కే 10… ఈ కారు స్టార్టింగ్ ప్రైజ్ 3.99 లక్షలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 24.39 kmpl గా ఉండగా సీఎన్టీ మైలేజీ వేరియంట్ మైలేజీ 33.86 km/kg వస్తుంది.
మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో… ఈ కారు ప్రారంభ ధర రూ.4.26 లక్షలు నుంచి ఉంది. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 24.12 kmpl గా ఉండగా సీఎన్టీ మైలేజీ వేరియంట్ మైలేజీ 32.73 km/kg వస్తుంది.
హుంద్యాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ ప్రారంభ ధర రూ.5.84 లక్షలు నుంచి ఉంది.. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 21 kmpl గా ఉండగా సీఎన్టీ మైలేజీ వేరియంట్ మైలేజీ 28 km/kg వస్తుంది. తరువాతి స్థానంలో ఇదే కంపెనీ నుంచి హుంద్యాయ్ ఎక్స్ టర్ పేరుకు ఎస్ యూవీ అయినా ప్రారంభ ధర రూ.5.99 లక్షలుగా ఉంది.. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 19.2 kmpl సీఎన్ జీ వేరియంట్ మైలేజీ 27.1 km/kg వస్తుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Top 5 cars in the country if you know the price you will be shocked
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com