Maruti Suzuki Alto K10: కారు కొనాలని అనుకున్నప్పుడు వినియోగదారులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొందరు లో బడ్జెట్ లో కారు కొనాలని అనుకుంటారు. మరికొందరు ఫీచర్స్ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం Milage ఇచ్చే కారు కోసం వెతుకుతూ ఉంటారు. కార్లు కొనే మిడిల్ క్లాస్ పీపుల్స్ ముందుగా ఆలోచించేంది మైలేజ్ గురించే. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు సైతం మైలేజ్ ను దృష్టిలో ఉంచుకొని కార్లను మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లలో Maruthi Suzukiముందు ఉంటుంది. అందుకే చాలా మంది మారుతి కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అయితే మారుతి కంపెనీకి చెందిన ఓ కారు అత్యధిక మైలేజ్ ఇచ్చి ఆకట్టుకుంటోంది. మిగతా కార్ల కంటే ధీటుగా ఇది మైలేజ్ ఇవ్వడంతో చాలా మంది దీనిని కొనేందుకు ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?
Maruthi Suzuki ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసమే కార్లు తయారు చేస్తుందని అని కొందరు అంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ కంపెనీకి చెందిన Alto K 10 కారు ది బెస్ట్ గా నిలిచింది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారితో పాటు మంచి మైలేజ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో రూ.4.09 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇందులో అదనంగా పీచర్లు వేసుకున్న టాప్ వేరియంట్ ధర రూ. 6.05 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందంటే?
Maruthi Suzuki Alto K 10 మోడల్ పెట్రోల్ వెర్షన్ తో పాటు CNG వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ విషయానికొస్తే.. 1.0 లీటర్ 3 సిలిండర్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 66 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ పై ఈ కారు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. CNGపై ఏకంగా 34 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది.
ఆల్టో కె 10 మైలేజ్, ధర మాత్రమే కాకుండా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో గేర్ షిప్ట్ ఇండికేటర్, ఎయిర్ కండిషన్, ఫ్రంట్ పవర్ విండోస్ వంటివి ఆకర్షిస్తాయి. అలాగే హలోజన్ హెల్ ల్యాప్లు, సెంటర్ కన్సోల్ ఆర్మ్ రెస్ట్ వంటివి ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ కారు మైలేజ్ ఎక్కువగా ఇస్తుండడంతో దీనికి చాలా మంది కొనుగోలు చేశారు. 2025 జనవరి నెలలో దీనిని 11,352 మంది కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కింగ్ జిమ్నీ, ఎస్ ప్రెస్సో, సెలెరియో వంటి కార్లను బీట్ చేసింది. అయితే చిన్న ప్యామిలీకి అనుగుణంగా ఉండడంతో పాటు కార్యాలయ అవసరాల కోసం కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మిగతా కార్ల కంటే ఇందులో 4గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లడానికి అనుగుణంగా ఉంటుంది.