spot_img
Homeబిజినెస్రైతులకు షాక్.. వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావట..?

రైతులకు షాక్.. వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావట..?

PM Kisan Samman Nidhi

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో ఈ స్కీమ్ నగదు జమ కావాల్సి ఉండగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ స్కీమ్ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావిస్తోంది.

త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమ కానుంది. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 6,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ స్కీమ్ నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు అర్హులైన రైతుల ఖాతాలలో ఏడు విడతల నగదు జమ కాగా త్వరలో ఎనిమిదో విడత నగదు జమ కానుంది. అయితే కేంద్రం ఇకపై కొంతమంది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నగదును జమ చేయదని సమాచారం.

సాగు చేసే వారి పేరుపై పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. సాగు చేసే వ్యక్తి తల్లి, తండ్రి పేర్లపై పొలం ఉంటే మాత్రం ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు. పొలాన్ని సాగు చేయని వారు, ఇతర అవసరాల కోసం పొలాన్ని వినియోగించే వారు కూడా డబ్బులను పొందలేరు. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో తప్పులు ఉంటే కూడా పీఎం కిసాన్ డబ్బులను పొందడం సాధ్యం కాదు.

ప్రభుత్వ ఉద్యోగులకు పొలం ఉంటే వాళ్లు కూడా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందలేరు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏ, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ పదవుల్లో ఉన్నవారు కూడా పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హులు కాదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper