Homeబిజినెస్Motorola edge 70 Plus; గొరిల్లా గ్లాస్.. ఐపి 64 రేటింగ్..ఇంకా ఎన్నో ప్రత్యేకతలు.. ధర...

Motorola edge 70 Plus; గొరిల్లా గ్లాస్.. ఐపి 64 రేటింగ్..ఇంకా ఎన్నో ప్రత్యేకతలు.. ధర ఎంత అంటే..

Motorola edge 70 Plus;స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కంపెనీలలో మోటరోలా ప్రముఖమైనది. మార్కెట్లో వాటాను మరింత పెంచుకోవడానికి ఈ కంపెనీ ఇటీవల కాలంలో వరుసగా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. Motorola edge 70 Plus అనే వెరైటీని మోటరోలా కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఆకట్టుకునే విధంగా డిస్ప్లే ఉంది.. 200 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ […]

Motorola edge 70 Plus;స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కంపెనీలలో మోటరోలా ప్రముఖమైనది. మార్కెట్లో వాటాను మరింత పెంచుకోవడానికి ఈ కంపెనీ ఇటీవల కాలంలో వరుసగా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది.

Motorola edge 70 Plus అనే వెరైటీని మోటరోలా కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఆకట్టుకునే విధంగా డిస్ప్లే ఉంది.. 200 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ 7 ఐ.. ఐపి 64 రేటింగ్.. ఎమ్ఐ ఎల్ ఎస్ టి డి 810 హెచ్ డ్యూరబులిటీ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్ 70 ప్లస్ 8 జిబి ర్యామ్+ 256 జిబి స్టోరేజ్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. దీని ధర 68000.. ఇక మోటరోలా అధికారిక వెబ్సైట్లో ప్రీ ఆర్డర్లను మొదలుపెట్టింది. ఈనెల 23 నుంచి విక్రయాలు మొదలవుతాయి.. ఈ ఫోన్ గ్రే లీలాక్.. మౌంటెన్ యు.. మిల్కీ వ్యూ.. పాంటోన్ అనే రంగులలో లభిస్తూ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్గా కస్టమర్లకు మోటో వాచ్ ఫిట్.. మోటో టాగ్ టూ ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

ఇందులో 6.78 అంగుళాల ఎక్స్ట్రీమ్ అమో లెడ్ డిస్ప్లే ఉంది. 2772* 1272 మెగాపిక్సల్ సూపర్ హెచ్ డీ పారదర్శకతను అందిస్తుంది. గరిష్టంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తుంది. హెచ్డిఆర్ టెన్ ప్లస్.. టెన్ బిట్ కలర్.. 100% డి సి ఐ పి త్రీ కలర్ గామట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

గేమింగ్ ఇష్టపడే వారికి.. 6500 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న బ్యాటరీని మోటరోలా కంపెనీ ఇందులో పొందుపరిచింది. ఈ ఫోన్ విషయంలో మోటరోలా అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొంతకాలంగా మోటరోలాకు సరైన స్థానం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో తన వాటా పెంచుకోవడానికి మోటోరోలా కంపెనీ ఈ మోడల్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జెన్ జెడ్ ఎక్కువ ఫీచర్లను ఇష్టపడుతున్న నేపథ్యంలో.. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే విక్రయాలు ప్రారంభించనుంది. ప్రముఖ ఆన్లైన్ వేదికలతో పాటు.. కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా ఈ ఫోన్ విక్రయాలు నిర్వహిస్తామని కంపెనీ ప్రకటించింది. దీనికి తోడు క్రెడిట్ కార్డుల ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే మోటరోలా కు సంబంధించిన ఉత్పత్తులు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ఇన్స్టంట్ క్యాష్ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper