OnePlus summer sale 2026 discounts: OnePlus కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్లకు ఆదరణ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల ప్రీమియం ఫోన్లు కొనలేని కొందరికి ఈ కంపెనీ కొన్ని సందర్భార్లో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా సమ్మర్ సేల్ 2026 కింద కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ఇయర్‌ఫోన్లు , ఇతర గ్యాజెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ మే 8, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి amazon, flipkart, OnePlus ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉండనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
OnePlus 15 సిరీస్ ఆఫర్లు:
OnePlus Summer Saleలో భాగంగా OnePlus 15 సిరీస్ సాఫ్ట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్లు, నో‑కాస్ట్ EMI సౌకర్యంతో అందుబాటులో ఉండనుంది. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం.. OnePlus 15 యొక్క నెట్ ధర ప్రస్తుతం రూ. 77, 999గా ఉంది. ఇది రూ. 68,999 నుంచి రూ.72,999 వరకు తగ్గుతుందని తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉండనున్నాయి.
OnePlus 13 సిరీస్ డీల్స్:
OnePlus 13 సిరీస్ పై కూడా మంచి డీల్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ. 64,999గా ఉంది. దీనిపై రూ.7,000 తక్షణ ధర తగ్గింపుతో పాటు మరింత రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో దీనిని రూ. 57,999 కి తగ్గుతోంది. అదేవిధంగా OnePlus 13R, 13s మోడల్స్‌పై కూడా రూ.3,000 నుంచి రూ.5,000 వరకూ డిస్కౌంట్లు , అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది.
OnePlus Pad 4:
సమ్మర్ సేల్‌లో OnePlus Pad ట్యాబ్లెట్‌లు కూడా తగ్గింపు ధరలతో అందుబాటులో ఉండనుంది. OnePlus Pad 4 యొక్క 8GB + 256GB వేరియంట్ రూ. 59,999కి లాంచ్ అయినప్పటికీ, బ్యాంక్ డిస్కౌంట్‌ల ద్వారా సుమారు రూ.54,999 నెట్ ధరకు పొందే అవకాశం ఉంది. 12GB + 512GB వెర్షన్‌కి కూడా రూ.5,000 వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్లాన్‌లు ఉన్నాయి.
వీటితో పాటు OnePlus Nord 6 వంటి మిడ్ రేంజ్ ఫోన్లు, పాడ్స్, ఇయర్‌ఫోన్లపై కూడా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్/నో‑కాస్ట్ EMI ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆఫర్లు ప్రధానంగా HDFC, SBI, ICICI వంటి బ్యాంక్ కార్డ్‌ల ఆధారంగా ఉంటాయి. అలాగే సెలెక్టెడ్ పేమెంట్ గేట్‌వేల ద్వారా మాత్రమే వర్తిస్తాయి.
ఈ OnePlus Summer Sale మే 8 నుంచి మే చివరి వారం వరకూ కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో పరిమిత సమయానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందువల్ల OnePlus 15, OnePlus 13, OnePlus Pad 4 లాంటి డివైస్‌లపై మంచి డీల్ కావాలని అనుకునేవారు ప్రీ రిజర్వ్ చేయించడం మంచిది.