Homeజాతీయ వార్తలుShyama Prasad Mukherjee Bengal vision: మోడీ, షా కాదు.. ఆపరేషన్ బెంగాల్ మొదలుపెట్టింది ఆయనే.....

Shyama Prasad Mukherjee Bengal vision: మోడీ, షా కాదు.. ఆపరేషన్ బెంగాల్ మొదలుపెట్టింది ఆయనే.. ఇన్నాళ్లకు సాకారమైంది

Shyama Prasad Mukherjee Bengal vision: బెంగాల్ రాష్ట్రంలో బిజెపి గెలిచింది. నాలుగున్నర దశాబ్దాల పోరాటం ఫలించింది. బెంగాల్ రాష్ట్రంలో బిజెపి ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే బెంగాల్లో బిజెపి జెండా ఎగరవేయడానికి వీరికంటే ఎక్కువ కృషి చేసింది ఒక వ్యక్తి. కాకపోతే ఆరోజు ఆయన శక్తి సరిపోలేదు. ఆయన వేసిన పునాది వల్ల ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో బిజెపి జెండాను ఎగరవేసింది.

1982 నుంచి బెంగాల్ రాష్ట్రంలో బిజెపి పోటీ చేస్తోంది. అయినప్పటికీ బెంగాల్ ప్రజలు బిజెపిని అంతగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు నిరాశ చెందలేదు. మొదటి నుంచి కూడా బిజెపి ఇక్కడ సుదీర్ఘ పోరాటం చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. భారతీయ జనతా పార్టీకి గతంలో పూర్వ పేరుగా ఉన్న భారతీయ జన సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు హెగ్డే వార్ కోల్ కతా లో విద్యను అభ్యసించారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి, హెగ్డే వార్ కు మొదటి నుంచి కూడా బెంగాల్లో కాషాయం రెపరెపలాడాలని ఉండేది. ఎప్పటికీ భారతీయ జనసంగ్ పార్టీకి అక్కడ అంత పెద్దగా ఆదరణ లభించలేదు.

1982లో బెంగాల్ అసెంబ్లీలో పోటీ చేసింది. ఒక సీట్ కూడా దక్కించుకోలేకపోయింది. 1984 పార్లమెంటు ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో పోటీ చేసింది. 0.4% ఓట్లు మాత్రమే వచ్చాయి. 1987 అసెంబ్లీ ఎన్నికలు, 1989 పార్లమెంట్ ఎన్నికలు, 1991, 1996 ఎన్నికల్లోను అదే స్థాయిలో అనుభవం ఎదురైంది. 1998 పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో తొలిసారిగా బిజెపి ఎకౌంటు ఓపెన్ చేసింది. డూమ్ డూమ్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి తపన్ విజయం సాధించారు. 1999 పార్లమెంటు ఎన్నికల్లో టీఎంసీతో తో బిజెపి దోస్తీ కట్టింది. నాడు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2001 లోను గెలుపు అందుకోలేదు. 2004 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి.. టీఎంసీతో కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం రాలేదు. నాడు టిఎంసి ఒక్క పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితమైంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో గుర్ఖా జన ముక్తి పార్టీతో జట్టు కట్టి పోటీ చేస్తే డార్జిలింగ్ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2014లో జిజేఎం తో కలిసి పోటీ చేసి రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. 2016లో మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. 2019లో ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలిచి అదరగొట్టింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలిచి.. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది బిజెపి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper