Homeటాప్ స్టోరీస్Maruti Suzuki: ఐదు లక్షలకు బ్రహ్మాండమైన కారు.. ఆరు ఎయిర్ బ్యాగ్స్.. 34 కిలోమీటర్ల మైలేజ్..

Maruti Suzuki: ఐదు లక్షలకు బ్రహ్మాండమైన కారు.. ఆరు ఎయిర్ బ్యాగ్స్.. 34 కిలోమీటర్ల మైలేజ్..

Maruti Suzuki WagonR: మనదేశంలో కార్లు ఉపయోగించే వాళ్లకు మారుతి కంపెనీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ కంపెనీ తయారు చేసిన కార్లు మన దేశంలోని రోడ్లమీద ఎక్కువగా సందడి చేసేవి. ఆ తర్వాత అనేక కంపెనీలు మార్కెట్లోకి రావడంతో మారుతి జోరు కొంతమేర తగ్గింది. అక్షరాల ఐదు లక్షలు మారుతి కంపెనీ ప్రీమియం కార్ల కంటే.. బడ్జెట్ కార్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది. అందువల్లే ప్రతి మిడిల్ క్లాస్ […]

Maruti Suzuki WagonR: మనదేశంలో కార్లు ఉపయోగించే వాళ్లకు మారుతి కంపెనీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ కంపెనీ తయారు చేసిన కార్లు మన దేశంలోని రోడ్లమీద ఎక్కువగా సందడి చేసేవి. ఆ తర్వాత అనేక కంపెనీలు మార్కెట్లోకి రావడంతో మారుతి జోరు కొంతమేర తగ్గింది.

అక్షరాల ఐదు లక్షలు

మారుతి కంపెనీ ప్రీమియం కార్ల కంటే.. బడ్జెట్ కార్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటుంది. అందువల్లే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో మారుతి కారు తప్పకుండా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్లను టార్గెట్ చేస్తూ మారుతి కంపెనీ తాజాగా వ్యాగన్ఆర్ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర అక్షరాల ఐదు లక్షలు.. పైగా ఇది 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి.. లీటర్ కి 34 కిలోమీటర్ల మ్యారేజ్ ఇస్తున్న నేపథ్యంలో మధ్యతరగతి వాళ్లు ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు.

కార్ల విక్రయాలు పుంజుకున్నాయి

గడిచిన నెలలో మనదేశంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అమ్మకాలు సాధారణంగా సాగిపోయాయి. ఇందులో కొన్ని కార్ల అమ్మకాలు మాత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చి చూస్తే ఈసారి కార్ల విక్రయాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్లో తన సత్తాను మరోసారి చూపించింది. టాప్ 10 కార్ల విక్రయాలను ఒకసారి పరిశీలిస్తే.. జూలై నెల తో పోల్చి చూస్తే పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయనప్పటికీ మారుతి బ్రాండ్ తన జోరు కొనసాగించింది. దేశంలోనే హైయెస్ట్ సేల్ టాప్ 10 కార్ల జాబితాలో మారుతి సుజుకీ కి సంబంధించిన కార్లు ఉండడం విశేషం.

ఈ జాబితాలో డిజైర్.. స్విఫ్ట్ ను పక్కనపెట్టి వ్యాగన్ఆర్ ముందు వరసలోకి వచ్చింది. వాస్తవానికి మారుతి సుజుకి లో స్విఫ్ట్, డిజైర్ ముందు వరుసలో ఉంటాయి. కానీ ఈసారి వ్యాగన్ఆర్ ఆ బ్రాండ్లను పక్కనపెట్టింది. సరికొత్త మోడల్ గా అవతరించింది.

ఈ మోడల్ లో టాల్ బాయ్ డిజైన్.. అద్భుతమైన మైలేజ్ ఇండియన్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గడిచిన నెలలో ఈ బ్రాండ్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం ఒక్క నెలలోనే 20,180 యూనిట్లను మారుతి సుజుకి విక్రయించింది. గత ఏడాది ఆగస్టు నెలలో 14,552 యూనిట్లను విక్రయించగా.. ఈ సంవత్సరం మాత్రం అమ్మకాలలో 39 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ టెన్ కార్ల మొత్తం జాబితాలో వ్యాగన్ఆర్ ఏకంగా సెకండ్ హైయెస్ట్ సేల్స్ సాధించిన మోడల్ గా నిలవడం విశేషం.

ధర.. మైలేజ్ పరిశీలిస్తే..

  • ఈ మోడల్ ధర మిడిల్ క్లాస్ ప్రజల బడ్జెట్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుంది.
  • ఢిల్లీలోని ఎక్స్ షోరూం ధర 4.9 8 లక్షల నుంచి మొదలవుతుంది.
  • సిఎన్జి వేరియంట్ ధర 5.93 లక్షల నుంచి లభిస్తుంది.
  • మైలేజ్ ప్రకారం చూసుకుంటే
  • సిఎన్జి మోడల్ కిలో గ్రామ్ కు 34.05 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉంటుంది.
  • పెట్రోల్ మోడల్ లో లీటర్ కు 25.19 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తుంది.
  • ఈ మోడల్ కార్ లో ఇంజన్ 1197 సిసి (2 లీటర్ అడ్వాన్స్డ్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవిటి) అందుబాటులో ఉంది.
  • ఈ ఇంజన్ 66.9 k w (90.9 పిఎస్) పవర్ విడుదల చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
  • ఒకవేళ ఎంట్రీ లెవెల్ కావాలి అనుకుంటే వన్ పాయింట్ జీరో లీటర్ కే10 సీ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.
  • కస్టమర్ సెక్యూరిటీ కోసం అనేక సేఫ్టీ ఫీచర్లు
  • ఎయిర్ బ్యాగ్స్ ఈ కారు బేస్ వేరియంట్ లో 6 ఉన్నాయి. వాటిని అత్యంత భద్రత ప్రమాణాల ప్రకారంగా రూపొందించారు.
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈ బీడీతో కూడిన ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టం ఇందులో అందుబాటులో ఉంటుంది.
  • స్వీవేల్ సీట్ ఫీచర్ ఇందులో అందుబాటులో ఉంది. ప్రయాణికులు కారులో సులభంగా ఎక్కడానికి.. దిగడానికి స్వీవేల్ సీట్ ఆప్షన్ తోడ్పడుతూ ఉంటుంది.
  • ఎక్కువ మైలేజ్.. మెరుగైన సేఫ్టీ ఫీచర్లో ఉన్న నేపథ్యంలో వ్యాగన్ఆర్ ఇండియన్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు అత్యుత్తమమైన మోడల్ గా నిలిచింది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper