spot_img
Homeబిజినెస్Hyderabad To Texas: హైదరాబాద్ టు టెక్సాస్.. పెట్టుబడి పెడుతున్న తెలుగు ఎన్నారైలు ఎందుకో తెలుసా?

Hyderabad To Texas: హైదరాబాద్ టు టెక్సాస్.. పెట్టుబడి పెడుతున్న తెలుగు ఎన్నారైలు ఎందుకో తెలుసా?

Hyderabad To Texas: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఖరీదైనది కావడంతో ఎన్నారైలు టెక్సాస్‌ను ఇష్టపడుతున్నారు. చాలా మంది ఎన్నారైలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి బదులు రెండు ప్రముఖ టెక్సాస్‌ నగరాలు, డల్లాస్‌ మరియు ఆస్టిన్‌లలో భూమిని కొనుగోలు చేస్తున్నారు.

ప్రత్యామ్నాయమే బెటర్‌ అని..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భూమి కొనలేని పరిస్థితి. ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, మంత్రులు గొప్పగా చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భారీగా పెరిగిన ధరలతో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు వెనుకాడుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం కన్నా అమెరికాలో పెట్టడమే మేలనుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయం కోసం చాలా మంది ఎన్నారైలు చూస్తున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం టెక్సాస్‌లో దొరికింది.

హైదరాబాద్‌ కన్నా పది రెట్లు తక్కువ..
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భూముల ధరలు హైదరాబాద్‌ భూముల ధరలతో పోల్చితే పదింతలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ.40–50 కోట్ల వరకు ఉండగా, డల్లాస్, ఆస్టిన్‌లలో కేవలం 5,00,000 నుంచి 7,00,000 డాలర్లు పలుకుతోంది. అంటే మన కరెన్సీలో ఎకరం రూ.4 నుంచి రూ.6 కోట్లకు సమానం. హైదరాబాద్‌లో ఎకరం ధరలో పదో వంతు మాత్రమే. స్టేటస్‌తోపాటు అమెరికాలోని ఆయా నగరాల్లో వాతావరణం కూడా హైదరాబాద్‌ను తలపిస్తుంది. ఇండియన్స్‌ ఎక్కువగా ఉంటారు. దీంతో హైదరాబాద్‌ కన్నా.. అమెరికానే మేలనుకుంటున్నారు తెలుగు ఎన్నారైలు. మెరికాలో ఉన్నామని, భూమి కొన్నామని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు పెద్దపెద్ద కంపెనీలు ఆస్టిన్‌కు వస్తున్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఇటీవల ఆస్టిన్‌కు మార్చబడింది. టయోటా ప్రధాన కార్యాలయం కూడా రాష్ట్రంలో ఉంది.

ధరలు తక్కువ.. అభివృద్ధి ఎక్కువ..
ఇక టెక్సాస్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అదే సమయంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆసక్తి చూపడానికి బదులుగా అమెరికాలోని రాష్ట్రాల్లో భూమిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper