Multiple credit cards: ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు వినియోగదారులకు నేటి కాలంలో బ్యాంకులు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నాయి. అవసరానికి డబ్బును రుణముగా ఇస్తూ.. తక్కువ వడ్డీని విధిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి అయితే మరింత తక్కువగా వడ్డీతో లోన్లను ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని రోజులపాటు డబ్బు సహాయం చేసి వాటికి వడ్డీ కూడా తీసుకోవడం లేదు. ఆ డబ్బును క్రెడిట్ కార్డు ద్వారా వాడుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది వినియోగదారుల వద్ద క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. కొందరి దగ్గర ఒకటికి మించి కార్డులు ఉన్నాయి. అయితే క్రెడిట్ కార్డులు సక్రమంగా వాడితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఫలితంగా బ్యాంకు నుంచి అనేక ఆఫర్లు వస్తాయి. కానీ ఒక్కోసారి సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకు కారణాలు ఇవే..
Also Read: పాత కారు అమ్ముతున్నారా? ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మంచి రేటు వస్తుంది
కొంతమంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటాయి. కానీ వీరు అన్ని క్రెడిట్ కార్డులను వాడలేక పోతుంటారు. కొన్ని ఆఫర్ల ద్వారానో లేదా ఉద్యోగ మారినప్పుడు బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డులు ఉండిపోతాయి. అయితే ఒకటికి మించి క్రెడిట్ కార్డు లో ఉన్నప్పుడు.. వాటిని వాడలేక పోయినప్పుడు.. బ్యాంకుకు తిరిగి ఇవ్వడమే మంచిది. ఎందుకంటే ఒక క్రెడిట్ కార్డు ఏడాది పాటు వాడకుండా ఉంటే దానిని బ్యాంక్ ఆటోమేటిగ్గా క్లోజ్ చేస్తుంది. అయితే ఈ సమయంలో ఈ క్రెడిట్ కార్డ్ వాడకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్యాంకు క్లోజ్ చేసే పరిస్థితి రాకుండా ముందే క్రెడిట్ కార్డును క్లోజ్ చేసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉండదు.
చాలావరకు క్రెడిట్ కార్డులు ఉన్నవారు బిల్డింగ్ డేటు తో పాటు డ్యూటీ ఒకేసారి పెట్టుకోవడం మంచిది. కొందరు ఒక్కో కార్డు డేటు మరో కార్డు రేటుతో సంబంధం లేకుండా ఉంటుంది. ఈ క్రమంలో బిల్లు చెల్లించే సమయం మరిచిపోయే అవకాశం ఉంటుంది. దీంతో సమయానికి బిల్లు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డుల బిల్డింగ్ డేట్స్ అన్ని ఒకే తేదీ ఇలా ఉండేలా చూసుకోవాలి.
క్రెడిట్ కార్డు డ్యూ డేట్ ను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క ఈఎంఐ తగ్గిన ఖాతాదారుడి ఇంప్రెస్ మైనస్ అవుతుంది. దీంతో ఇది సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా కొన్ని ఆఫర్లు రాకుండా ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బిల్లు చెల్లించే తేదీని మర్చిపోకుండా ఉండాలి.
Also Read: ఈవీలను 100% ఛార్జ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఎక్కువ క్రెడిట్ కార్డులో ఉన్నప్పుడు కొన్నింటిని యూపీఐతో లింక్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయడం వల్ల ఆ కార్డు ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో అది హోల్డ్ లో పడే అవకాశం ఉండదు. మిగతా కార్డును ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ అన్ని కార్డులు పనిచేసే విధంగా చేసుకోవచ్చు.