Personal Loan : ఇప్పుడున్న కాలంలో డబ్బు లేకపోతే ఏ పని జరిగే అవకాశం లేదు. ప్రతి అవసరం.. ప్రతి వస్తువు డబ్బు లేనిదే ఎవరికి దక్కే అవకాశం లేదు. అందువల్ల ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు ఎలా సంపాదించాలని చాలామంది తపన పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా ఖర్చులు అంతకుమించి ఉండడంతో ఆదాయం సరిపోవడం లేదు. దీంతో కొన్ని అవసరాల కోసం అదనంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇతరుల వద్ద అప్పులు చేసేవారు. కానీ ఇప్పుడు బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. అయితే కొంతమంది అవగాహనతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాటిని తిరిగి విజయవంతంగా చెల్లిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం లోన్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు. కానీ చెల్లించే సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొత్తగా బ్యాంకు నుంచి రుణం తీసుకునేవారు ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
Also Read: పెద్ది vs ప్యారడైజ్ ఈ భీకర పోటీలో వెనక్కి తగ్గేది ఎవరు…
అవసరం ఉందా? లేదా?
బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి దాదాపు డెబిట్ తో పాటు క్రెడిట్ కార్డు కూడా అందిస్తున్నారు. ఇలా రెండు కార్డులు యూస్ చేసినప్పుడు బ్యాంకులు కొన్ని ఆఫర్లు అందిస్తూ ఉంటాయి. ఇందులో పర్సనల్ లోన్ కూడా ఇస్తామని చెబుతూ ఉంటాయి. బ్యాంకు ఆర్థిక వ్యవహారాలను బట్టి పర్సనల్ లోన్ ఆఫర్ చేసినప్పుడు కొందరు ఆకర్షితులు అవుతారు. దీంతో అవసరం లేకున్నా తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్నారని తీసుకుంటారు. కానీ అవసరం లేకున్నా కూడా రుణం తీసుకుంటే.. వాటికి కట్టే వడ్డీ అదనపు ఖర్చు అవుతుంది. దీంతో వచ్చే ఆదాయంలో ఇది ఖర్చు కింద వెళ్ళిపోతుంది. అయితే అవసరం ఉంటే మాత్రం లోన్ తీసుకోవడం మంచిది.
ఈఎంఐ కట్టే కెపాసిటీ..
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ నెలనెలా ఈఎంఐ చెల్లించేటప్పుడు చాలామంది ఆవేదన చెందుతారు. అయితే బ్యాంకు రుణం తీసుకున్న తర్వాత వచ్చిన ఆదాయంలో ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉందా? లేదా? ముందే డిసైడ్ చేసుకోవాలి. ఒక్కోసారి కొందరు ఈఎంఐ చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అధికంగా ఆర్థిక భారమై ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Also Read: అందం లో మహేష్ బాబు తో పోటీపడే హీరో తెలుగులో ఒకరున్నారు…కానీ సక్సెస్ లు మాత్రం లేవు…
సిబిల్ స్కోర్ చెకింగ్..
పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఒక్క ఈఎంఐ చెల్లించకపోయినా సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా సిబిల్ స్కోర్ పడిపోతే ఆ తర్వాత జరిగే ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. అందువల్ల ఈఎంఐ రెగ్యులర్ గా కడుతూ ఉండాలి. ఇదే సమయంలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సిబిల్ స్కోర్ తగ్గితే దానిని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే బ్యాంకు నిపుణులను సంప్రదించవచ్చు.
వడ్డీ రేటు..
కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణం ఇస్తాయని చెబుతాయి. కానీ ఆ తర్వాత వడ్డీలు పెంచుతూ ఉంటాయి. అలా కాకుండా ఫిక్స్డ్ వడ్డీకి మాత్రమే రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్బిఐ రూల్స్ ప్రకారం వడ్డీ రేట్లు పెరిగితే ఈ లోన్ కు సంబంధించిన వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని ముందే నిర్ధారణ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఆర్థిక భారం పెరిగిపోతుంది.