Maruti Suzuki Cars: ప్రొడక్టు ఉత్పత్తి ఎంత నాణ్యతగా ఉన్నా.. దానికి మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడే తయారీదారుకు లాభాలు వస్తాయి. కొనేవారు లేకుంటే.. ప్రొడక్టు వృథానే. ఇప్పుడు దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ తయారు చేసిన ఓ కారు పరిస్థితి ఇలాగే ఉంది. మారుతి సుజుకి సెలెరియో విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఇది సాధారణంగా అమ్మకాల పరంగా దేశంలోని టాప్ 25 కార్లలో కూడా చేరదు. అయితే కారు పొదుపుగా ఉంటుంది. మంచి మైలేజీని ఇస్తుంది. అనేక అవసరమైన ఫీచర్లను అందిస్తుంది. ఇన్ని విషయాలు ఎలా ఉన్నా, అమ్మకాల పరంగా సెలెరియో ప్లాప్ ఎడిషన్‌గా మారింది.
ధర తక్కువే..
మారుతి సెలెరియో 5–సీటర్ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది – LXI, VXI, ZXI, ZXI+ వీటిలో, సీఎన్జీ వేరియంట్ VXI ట్రిమ్‌లో కూడా అందుబాటులో ఉంది. సెలెరియో ధరలు రూ. 5.37 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ వేరియంట్ కోసం రూ. 7.14 లక్షల (ఎక్స్–షోరూమ్) వరకు ఉంటాయి. దీని సీఎన్జీ వేరియంట్ ధర రూ. 6.74 లక్షలు.
మంచి ఫీచర్లు..
మారుతి సెలెరియోలో 7–అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, పాసివ్ కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, సెమీ–డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ (వ్యాగన్ ఆర్ వేరియంట్), టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలు, డ్యూయల్ ఫ్రంట్ ఉన్నాయి. ఈబీడీతోకూడిన ఏబీఎస్, హిల్–హోల్డ్ అసిస్ట్(ఆటోమేటిక్ వేరియంట్లలో), వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంజన్ స్పెసిఫికేషన్స్..
ఇది 1.0–లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్‌పై 67 పీఎస్, 89 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, ఇది సీఎన్జీపై 56.7 పీఎస్/82ఎన్ఎవ పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. పెట్రోల్ ఇంజిన్∙5–స్పీడ్ మాన్యువల్, 5–స్పీడ్ ఏఎంటీ ఎంపికతో వస్తుంది. అయితే సీఎన్జీ వేరియంట్ 5–స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇది సెగ్మెంట్ మొదటి ఆటోమేటిక్ ఐడిల్ స్టార్ట్–స్టాప్‌ను కూడా కలిగి ఉంది.
సెలెరియో మైలేజ్ ఇలా..
– పెట్రోల్ ఎంటీ: 25.24 కేఎంపీ వరకు
– పెట్రోల్ ఏఎంటీ: 26.68 కేఎంపీ వరకు
– సీఎన్జీ : 35.6 కేఎంపీ వరకు ఉంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More