Sandeep Reddy Vanga: అనిమల్ సినిమాతో ప్రభంజనాన్ని సృష్టిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి ముందు ఆయన చాలా కష్టాలు అనుభవించాడు. చాలామంది అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతో ఒక్క నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అనుకుంటారు. కానీ దానికి ముందు ఆయన పడిన వేదన అంతా ఇంతా కాదు ముందుగా నాగార్జున హీరోగా వచ్చిన కేడి సినిమాకి అలాగే శర్వానంద్ హీరో వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
ఆ తర్వాత తన దగ్గర ఉన్న అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ తో చాలా మంది ప్రొడ్యూసర్లను కలిసి వాళ్లకి కథలు చెప్పినప్పటికీ వాళ్లు ఆ స్క్రిప్ట్ పైన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు మరికొంతమంది అయితే తనని సంవత్సరం వరకు సినిమా చేద్దాం అని తిప్పుకొని ఆ తర్వాత మేము నీతో ఈ సినిమా చేయము వేరే కథ ఉంటే చెప్పు అని అనడంతో సందీప్ అక్కడి నుంచి కోపం తో బయటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక ఆయన టైమ్ అంత వేస్ట్ అయిపోయింది అనుకొని ఈ ప్రొడ్యూసర్లను నమ్మితే ఇలానే టైం వేస్ట్ చేయిస్తారు అని అనుకొని ఇక తనకి ఏ ప్రొడ్యూసర్ అవసరం లేదని తన సినిమాకి తనే డబ్బులు ప్రొడ్యూస్ చేసుకోవాలని అనుకొని తనకున్న 36 ఎకరాల భూమిని అమ్మితే వచ్చిన కోటిన్నరతో అర్జున్ రెడ్డి సినిమా చేశాడు.
ఇక అప్పటికి కూడా సినిమా పూర్తి కాకపోవడంతో వాళ్ళ నాన్న సహాయంతో మరో కోటి రూపాయలు తీసుకొని సినిమాని పూర్తి చేశాడు. అలా అర్జున్ రెడ్డి సినిమా పూర్తయింది ఈ సినిమా రిలీజ్ అయి 50 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది.ఇక దాంతో అప్పుడు అందరికీ అర్థం అయింది ఇండస్ట్రీ కి సందీప్ రెడ్డి వంగ అనే ఒక డైరెక్టర్ వచ్చాడు అని…ఇక సినిమా ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ రావడానికి ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా దాని వెనకాల చాలా కష్టపడాల్సి ఉంటుంది. సక్సెస్ అనేది ఊరికే రాదు అని చెప్పడానికి సందీప్ రెడ్డి వంగ ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
అయితే ఆయన ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడని చాలా మంది అనుకుంటున్నారు కానీ అవన్నీ అపోహలు ఆయన తన కెరియర్ లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మరి ముందుకు సాగితేనే తను డైరెక్టర్ గా నిలబడ్డాడు. ఇవాళ బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసే అనిమల్ లాంటి ఒక సినిమాను తీశాడు అంటే ఆయన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…