Gold Price Today Hyderabad : మనదేశంలో రకరకాల పండుగలు, పెళ్లిళ్ల సందర్భంలో వీటి కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమంది బంగారు ఆభరణాలను కుండీలలో దేవుడికి కానుకగా కూడా ఇస్తారు. అలాగే బంగారాన్ని ఆడపడుచులకు కట్నం గా కూడా ఇస్తారు. ఈ క్రమంలో మన దేశ మార్కెట్లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. కానీ గత కొంతకాలం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమా కాదా అంటూ చాలామంది ఆలోచిస్తున్నారు. జూన్ 1, 2025న స్వచ్ఛమైన ఒక తులం బంగారం ధర మార్కెట్లో రూ.95,510, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 10 గ్రాములు రూ.87,550 గా ఉంది. గతంలో ఎన్నడు లేని విధంగా లక్ష మార్కును దాటిన తులం బంగారం ధరలు ప్రస్తుతం కొంచెం తగ్గుతున్నాయి. ఈ మధ్యకాలంలో మళ్లీ తులం బంగారం ధర 98 వేలకు చేరుకుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి.
మనదేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,310, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,200, కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉన్నాయి.
విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,310, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,200, కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,460, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,350, కిలో వెండి ధర రూ.99,900 గా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,310, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,200, కిలో వెండి ధర రూ.99,900 గా ఉన్నాయి.
చెన్నై మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 97,310, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,200, కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉన్నాయి.
ఇక బెంగళూరు నగరంలో స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.97,310, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,200, కిలో వెండి ధర రూ.99,900 గా ఉన్నాయి.