Venkatesh And Nagarjuna Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలతో వరుసగా 12 విజయాలను సాధిస్తే అనిల్ రావిపూడి చేసిన ఎనిమిది సినిమాలతో ఎనిమిది విజయాలను సాధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ఎప్పుడైతే రాజమౌళి త్రిబుల్ ఆర్ (RRR) సినిమా చేశాడో అప్పట్నుంచి స్టార్ హీరోలందరు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచి కథ దొరికితే హీరోలందరూ మల్టీస్టారర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన వెంకటేష్ (Venkatesh) – నాగార్జున (Nagarjuna) లతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈయన కామెడీ సినిమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా కామెడీ వే లోనే సాగబోతుంది అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుంటే మరి కొంతమంది మాత్రం మొదటిసారి అనిల్ రావిపూడి ఒక సీరియస్ సినిమాని చేయాలని చూస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి.
ఇక సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉండే గొడవలను చాలా గొప్పగా చూపించాలనే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక వర్కౌట్ అయితే అటు వెంకటేష్, ఇటు నాగార్జున అభిమానులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. 35 సంవత్సరాల నుంచి వీళ్ళ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా వస్తుంది అంటూ చాలా రకాల వార్తలు వచ్చినప్పటికి ఇప్పటి వరకు అవేవీ కార్యరూపం అయితే దాల్చలేదు.
కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) వీళ్ళిద్దరినీ కలపాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చిరంజీవితో సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూడు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న అనిల్ రావిపూడి నాగార్జున తో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఇక నాగార్జునతో కూడా సినిమా చేసినట్లయితే సీనియర్ హీరోలు నలుగురితో సినిమాలను చేసిన ఈ జనరేషన్ లో ఉన్న ఏకైక దర్శకుడిగా అనిల్ రావిపూడి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు. కాబట్టి ఈ మల్టీస్టారర్ సినిమాతో ఆయన ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేయబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…