Flood Damaged Car Insurance: ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే కార్లు వాడేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సరళికృత ఆర్థిక విధానాల వల్ల కార్లు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. చాలామందిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోవడంతో కార్లను కొనుగోలు చేస్తున్నారు. పైగా విలాసం అని కాకుండా.. అత్యవసరమైన ట్రాన్స్ పోర్ట్ కు కార్లను ఉపయోగిస్తున్నారు. అందువల్లే కార్ల వినియోగం.. కొనుగోలు నేటి కాలంలో పెరిగిపోతుంది.
కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కార్లను తయారు చేస్తున్నాయి. ఇందులో బడ్జెట్.. సెమీ బడ్జెట్.. మీడియం.. ప్రీమియం వంటివి భాగాలలో కార్లను రూపొందిస్తున్నాయి. కార్లను కొనుగోలు చేయడమే కాదు.. సక్రమంగా వాటిని ఉపయోగించడం.. సరైన విధానంలో నిర్వహణ కొనసాగించడం అత్యంత ముఖ్యం. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కొన్ని సందర్భాలలో ప్రకృతి విపత్తుల వల్ల.. ఇతర సమస్యల వల్ల కార్లు పాడైపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు బీమా అనేది కచ్చితంగా ఉండాలి.
కార్లు కొనుగోలు చేస్తున్నప్పుడే కంపెనీల వద్ద బీమా కూడా చేయించుకోవాలి. ప్రకృతివిపత్తులు సంభవించినప్పుడు.. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు.. వాహనాలు ధ్వంసం అవుతుంటాయి. అలాంటప్పుడు బీమా కంపెనీలు జరిగిన నష్టాన్ని అంచనా వేసి డబ్బులు చెల్లిస్తుంటాయి. బీమా తీసుకుంటున్నప్పుడు కచ్చితంగా నిబంధనలు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. కొన్ని కంపెనీలు కొన్ని విషయాలను దాచిపెడుతుంటాయి. ముఖ్యంగా ఇంజన్.. ఇతర విషయాలను గోప్యంగా ఉంచుతుంటాయి. అటువంటి వాటి విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. కంపెనీ ప్రతినిధులను పదేపదే అడగాలి. అప్పుడే బీమా పొందడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కార్లు డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాలలో వరద నీరు ముంచేస్తూ ఉంటుంది కాబట్టి.. కార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చెట్లు విరిగి మీద పడితే కూడా కార్లు మరమ్మతులకు గురవుతుంటాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో కార్లు పాడైపోతే అది ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.. అయితే కార్లు పాడైపోయినప్పుడు నేరుగా అదీకృత మరమతుల కేంద్రం వద్దకు తీసుకెళ్లకుండా.. బయట తాత్కాలిక మరమ్మతులు చేయించడం.. బీమా కంపెనీకి ముందుగా చెప్పకపోవడం వంటివి గనుక చేస్తే క్లైమ్ రావడం సాధ్యం కాదు. అలాగే పాలసీలో ఇంజన్ ప్రొటెక్షన్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే అదనపు ఖర్చు పడే ప్రమాదం ఉంది.. వర్షాకాలంలో కార్లు కొనుగోలు చేస్తున్నవారు.. ఇంతకుముందు కార్లను కొనుగోలు చేసిన వారు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి. అప్పుడే నగదు పొందడానికి అవకాశం ఉంటుంది.