Pulasa Fish Price: పులస.. ఈ మాట వింటేనే గోదారి జిల్లాల్లో నోరూరుతుంది. శ్రేష్టమైన, స్వచ్ఛమైన చేప ఇది. అతిథులకు రాచమర్యాదలతో ఈ చేపను ఆహారంగా ఉండి పెడతారు. అయితే ఈ చేప కిలో వందల్లో ఉండదు.. వేలల్లో ఉంటుంది. అది కూడా 10000 దాటి ఉంటుంది. ఈ అరుదైన చేప దొరకడం చాలా కష్టం. ఈ ఏడాది తొలి చేప దొరికింది. 1200 గ్రాములు ఉన్న ఈ చేప ఏకంగా 14 వేలకు అమ్ముడైంది. అంటే ఈ చేప విశిష్టత ఏ స్థాయిదో అర్థం అవుతుంది. ఈ ఏడాదికి దొరికిన తొలి చేప కూడా ఇదే. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు.
* వర్షాభావ పరిస్థితులతో..
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గోదావరిలో నీటి ప్రవాహం కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో సముద్రం నుంచి చేపల ఉత్పత్తికి గాను గోదావరి నదిలోకి వచ్చి పులస చేపలు వలకు చిక్కుతాయి. అయితే ఎర్ర నీటి ప్రవాహం నదిలో ఎక్కువగా ఉన్న సమయంలోనే ఎక్కడో.. వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసే ఈ చేపలు నదిలోకి ఎగబడతాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నదిలో నీటి ప్రవాహం లేదు. అందుకే ఇంతవరకు పులస చేపలు నదిలోకి రాలేదు. మత్స్యకారులకు చిక్కలేదు. దీంతో ఈ ఏడాది మరి పులస చేపలు అని అంతా భావించారు. కానీ ఎట్టకేలకు ఒక పులస చేప చిక్కింది. గౌతమి గోదావరిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి కి చేరువలో మత్స్యకారుల వలలో 1250 గ్రాముల చేప పడింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానిని చూసేందుకు సమీప గ్రామాల వారు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
* మొదటిది ఇదే..
ఈ ఏడాది దొరికిన మొదటి పులస ఇదే. దీంతో యానాం రేవులో వేలం వేశారు. పొన్నమండ రత్నం, భద్రం దంపతులు రూ.14 వేలకు కొనుగోలు చేశారు. వెంటనే 500 రూపాయల లాభానికి మరో మత్స్యకారుడికి విక్రయించారు. సాధారణంగా యానంలో పులస చేపలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ చేపలు చిక్కడం లేదు. దీంతో ఈ చేపలు అంటేనే జనాలు ఎగబడి కుంటున్నారు. కానీ దొరకని పరిస్థితి.