Bigg Boss Telugu 10: మరో 10 రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ‘బిగ్ బాస్ 10’ షో గ్రాండ్ గా మొదలు కాబోతుంది. ఈ షోకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చినా అది బాగా వైరల్ అయిపోతుంది. ఈ రేంజ్ బజ్ , క్రేజ్ రావడానికి ప్రధాన కారణం , గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం, ‘అగ్ని పరీక్ష 2’ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రిటీల జాబితా ని మనమంతా చూసాము. అయితే ఈ జాబితాలో చివరి నిమిషం లో కొందరు తప్పుకోగా , కొందరు ఒప్పుకున్నారు. కొత్తగా ఒప్పుకున్న వాళ్లకు ఫ్యామిలీ ఆడియన్స్ లో , సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉంది.
స్టార్ మా ఛానల్ లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ కూడా ఈ సీరియల్ ని ఎగబడి చూశారు. అందులో హీరో గా నటించిన ముకేశ్ గౌడ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు. ముఖ్యంగా లేడీస్ అయితే ఈయనంటే పిచ్చెక్కిపోతారు. గత సీజన్ లోనే ఇతను రావాల్సి ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ రాగానే ప్రతీ ఒక్కరు టైటిల్ కొట్టేస్తాడని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ క్రేజ్ ఉంది ఈయనకు. ఆ క్రేజ్ తో ఈయన కన్నడ లో ఒక సినిమా కూడా చేసాడు. అది కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన కాస్త యావరేజ్ గా ఆడినా , టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
అయితే గతం లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. గతం లో ఈయన బిగ్ బాస్ లోకి అడుగుపెడితే టైటిల్ కొట్టేస్తాడు అనేంత ఊపు ఉండేది. ఇప్పటికీ అలాంటి ఊపు ఉంది కానీ, ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ ఈయనకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ గురించి మాట్లాడుకోవాలి. ఇతనికి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా క్రేజ్ మామూలు రేంజ్ లో రాలేదు. టాస్కులు కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి, ముకేష్ కి ఇతని నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి మరి.