BSNL: మదర్స్ డే 2025 సందర్భంగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1999, రూ.1499 ప్లాన్‌లపై ఇప్పుడు ఎక్కువ వ్యాలిడిటీ లభిస్తుందని కంపెనీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. అయితే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్ మే 7, 2025 నుంచి మే 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ప్లాన్‌లతో మీకు ఎంత ఎక్కువ వ్యాలిడిటీ లభిస్తుందో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
Also Read: ఆపరేషన్ సిందూర్.. కల్నల్ సోఫియా ఖురేషి పాత్ర ఏంటి?
బీఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్: వ్యాలిడిటీ, ప్రయోజనాలు
రూ. 1999 బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో వినియోగదారులకు ఇప్పుడు 365 రోజుల బదులు 380 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో 600జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ రూ.1499 ప్లాన్: బెనిఫిట్స్, వ్యాలిడిటీ
రూ.1499 బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో ఇప్పుడు మీకు 336 రోజుల బదులు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 24జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. తక్కువ డేటా ఉపయోగించే వారికి, తక్కువ డబ్బులో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది.
బీఎస్ఎన్ఎల్ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసిన దాని ప్రకారం.. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ కి పోటీగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు మదర్స్ డే 2025 కోసం ప్రత్యేక ఆఫర్‌లు ఏమీ ప్రకటించలేదు. బీఎస్ఎన్ఎల్ ఆఫర్‌కు పోటీగా జియో, ఎయిర్‌టెల్, Vi వంటి కంపెనీలు ఏమైనా ఆఫర్‌లు తీసుకొస్తాయో లేదో చూడాలి.