Homeబిజినెస్BSNL Fiber plan: BSNL స్పార్క్ ఫైబర్ ప్లాన్.. ₹399లో 3300GB డేటా.. 50Mbps...

BSNL Fiber plan: BSNL స్పార్క్ ఫైబర్ ప్లాన్.. ₹399లో 3300GB డేటా.. 50Mbps స్పీడ్.. అదిరిపోయే ఆఫర్!

BSNL Fiber plan: బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో తక్కువ ధరలో అద్భుతమైన డేటా ఆఫర్ కోరుకునే ఫైబర్ యూజర్లకు BSNL సంచలనాత్మక ప్లాన్‌ను లాంచ్ చేసింది. ‘స్పార్క్’ పేరుతో ఉన్న ప్లాన్‌లో కేవలం నెలకు ₹399 చెల్లించి 3300GB హై-స్పీడ్ డేటా (50Mbps వేగంతో) పొందొచ్చు. అంతే కాదు, ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. దీంతో Jio, Airtel వంటి ప్రైవేట్ కంపెనీలకు తలపడేలా BSNL మార్కెట్‌లోకి బలంగా వచ్చింది. స్పార్క్ ప్లాన్ పూర్తి వివరాలు ప్లాన్ […]

BSNL Fiber plan: బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో తక్కువ ధరలో అద్భుతమైన డేటా ఆఫర్ కోరుకునే ఫైబర్ యూజర్లకు BSNL సంచలనాత్మక ప్లాన్‌ను లాంచ్ చేసింది. ‘స్పార్క్’ పేరుతో ఉన్న ప్లాన్‌లో కేవలం నెలకు ₹399 చెల్లించి 3300GB హై-స్పీడ్ డేటా (50Mbps వేగంతో) పొందొచ్చు. అంతే కాదు, ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. దీంతో Jio, Airtel వంటి ప్రైవేట్ కంపెనీలకు తలపడేలా BSNL మార్కెట్‌లోకి బలంగా వచ్చింది.

స్పార్క్ ప్లాన్ పూర్తి వివరాలు

  • ప్లాన్ పేరు: BSNL స్పార్క్ ఫైబర్ (Bharat Fibre Spark)
  • ధర: మొదటి 12 నెలలు ₹399/నెల (ఇంట్రోడక్టరీ ఆఫర్)
  • 13వ నెల నుంచి: ₹449/నెల
  • డేటా: 3300GB (3.3TB) 50Mbpsతో హై-స్పీడ్ డేటా..
  • వాయిస్ కాల్స్: అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ (ఫైబర్ వాయిస్ ఆప్షన్‌తో)
  • ఇతర బెనిఫిట్స్: ఉచిత OTT ప్లాట్‌ఫామ్‌లు (లైబ్రరీ యాక్సెస్), ఫ్రీ ఇన్‌స్టాలేషన్ (కొన్ని ప్రాంతాల్లో)
  • వాలిడిటీ: 30 రోజులు (ఆటో రిన్యూవల్)

ఈ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. BSNL అధికారిక సైట్‌లో లేదా నేరుగా స్థానిక ఆఫీసుల్లో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

ఎవరికీ ఈ ప్లాన్ ఉపయోగం?
ప్రస్తుతం టెలికాం కంపెనీల్లో జియోనే అత్యంత తక్కువ ధరకు ఇస్తుందని కొందరు అంటున్నారు. నెలకు రూ.300 నుంచి రూ.400 తో ఫైబర్ డేటా ఇస్తోంది. అయితే ఇది కేవలం 10 ఎంబీపీఎస్ మాత్రమే. 30 ఎంబీపీఎస్ కు ధర పెరుగుతోంది. ఎయిర్ టెల్ లోనూ ఇంచుమించి ఇదే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు బీఎస్ఎన్ ఎల్ లో రూ. 399లో 3.3TB డేటా అంటే రోజుకు 110GB వరకు పొందవచ్చు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు స్ట్రీమింగ్, గేమింగ్‌ చేసేవారికి ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ కొత్త ప్లాన్ కావాలని అనుకునేవారు ఆన్‌లైన్ లో selfcare.bsnl.co.inలో లాగిన్ చేసి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా స్థానిక BSNL ఆఫీస్/అథరైజ్డ్ రిటైలర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలను బట్టి ధర కాస్త మారొచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper