Homeబిజినెస్BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు పండుగే.. 5శాతం తగ్గింపుతో పాటు ఎక్స్ ట్రా వ్యాలిడిటీ

BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు పండుగే.. 5శాతం తగ్గింపుతో పాటు ఎక్స్ ట్రా వ్యాలిడిటీ

BSNL: మదర్స్ డే 2025 రాకముందే బీఎస్ఎన్ఎల్ కంపెనీ కస్టమర్ల కోసం ఓ అద్బుతమైన ఆఫర్‎ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కంపెనీ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపు, కొన్ని ప్లాన్‌లతో అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ఏ ప్లాన్‌లతో తగ్గింపు లభిస్తుంది. ఏ ప్లాన్‌లతో ఎక్కువ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను ఎప్పటి వరకు పొందగలరో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ మదర్స్ డే ఆఫర్
బీఎస్ఎన్ఎల్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.599, రూ.997, రూ.2399 ప్లాన్‌లపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఎవరైనా ప్రీపెయిడ్ యూజర్ రూ.1499 లేదా రూ.1999 ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, వారికి కంపెనీ నుంచి ఎక్స్ ట్రా వ్యాలిడిటీ బెనిఫిట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కంపెనీ అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే ఈ ఆఫర్ ప్రయోజనం లభిస్తుంది.

ఎక్స్ ట్రా వ్యాలిడిటీ
రూ.1499 ప్లాన్‌తో ఇంతకు ముందు 336 రోజుల వ్యాలిడిటీ లభించేది.. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ కింద ఈ ప్లాన్ మీకు 365 రోజుల వ్యాలిడిటీ ప్రయోజనాన్ని అందిస్తుంది. మరోవైపు, రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల బదులు 380 రోజుల వ్యాలిడిటీ ప్రయోజనం లభిస్తోంది.

ప్లాన్ బెనిఫిట్స్
రూ.1499 ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులకు కంపెనీ నుంచి 24 జీబీ హై-స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 SMS, అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది. అదే సమయంలో, రూ.1999 ప్లాన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 600 GB హై-స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 SMS, అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆఫర్ బెనిఫిట్ మే 14, 2025 వరకు మాత్రమే పొందవచ్చు. అంటే, మీరు 14వ తేదీ వరకు రీఛార్జ్ చేసుకుంటే తగ్గింపు, ఎక్స్ ట్రా వ్యాలిడిటీ బెనిఫిట్ లభిస్తుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular