Income from baldness: ఇప్పట్లో తగ్గిపోయింది గాని… అప్పట్లో ఓ గుండు వ్యక్తి మీడియాలో ప్రముఖంగా కనిపించేవాడు. సోషల్ మీడియాలో ఉన్న దర్శనం ఇచ్చేవాడు. యూట్యూబ్ ఛానల్స్ లో అయితే అతని గురించే చర్చ జరిగేది. ” డబ్బు ఎవరికీ ఊరికే రాదనేవాడు. తయారీ ఖర్చు లేదు. మజూరీ లేదు. మీకు నచ్చిన డిజైన్ తీసుకెళ్లొచ్చు. మీ డబ్బుకు మా బంగారం హామీ” అంటూ తనదైన శైలిలో చెప్పేవాడు.
అలా చెప్పే వ్యక్తి ఓ బంగారం షాప్ కు ఓనర్. ఆయన పేరు కిరణ్ కుమార్. ఎక్కడో నెల్లూరులో పుట్టిన అతను అంచలంచలుగా ఎదిగి లలిత జ్యువెలర్స్ బంగారం దుకాణాన్ని తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణాది మొత్తంలో విస్తరించాడు.. వాస్తవానికి బంగారం విక్రయించే దుకాణాలు తమ సంస్థకు సంబంధించిన ప్రకటనలను సెలబ్రిటీలతో రూపొందిస్తాయి. కానీ కిరణ్ అలాంటివాడు కాదు.. పైగా అతడిది గుండు కూడా. అయినప్పటికీ తనని తను నమ్ముకున్నాడు. నెత్తిమీద ఒక్క వెంట్రుక కూడా లేకపోయినా.. తనను తాను సెలబ్రిటీగా మార్చుకున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. వాస్తవానికి నెత్తి మీద జుట్టు లేదని.. బట్టతల ఉందని చాలామంది బాధపడతారు. అలాంటి వారికి ఒక రోల్ మోడల్ లాగా.. మోటివేటర్ స్పీకర్ లాగా మారిపోయాడు కిరణ్ కుమార్. అతడిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది బట్టతల ఉన్నవారు.. నెత్తి మీద జట్టు లేనివారు ప్రకటనలు చేస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్స్ మారుతున్నారు.
ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కూడా ఓ వ్యక్తి కిరణ్ కుమార్ లాగానే ఫేమస్. అతని పేరు షఫిక్ హసీం. ఉన్నత విద్యావంతుడు. ప్రస్తుతం అతడి వయసు 36 సంవత్సరాలు. మొదట్లో అతను జుట్టు బాగానే ఉండేది. కాలక్రమంలో జుట్టు మొత్తం ఊడిపోయింది. చివరికి బట్ట తల మిగిలింది. బట్టతల మిగిలిందని బాధపడలేదు. జుట్టు ఊడిపోయిందని ఇబ్బంది పడలేదు. బట్టతల మీద జుట్టు పెట్టించుకోవాలని ఆలోచన అతనికి కలగలేదు. చివరికి విగ్గు పెట్టుకోవాలనే ఆలోచన కూడా అతడి మదిలో మెదలలేదు. బట్టతలను తనకు గర్వంగా.. వారసత్వ సంపదగా భావించాడు. దానిని ఒక ఆదాయం వనరుగా మార్చుకున్నాడు. తన బట్ట తల మీద ప్రకటనలు రూపొందించడం ప్రారంభించాడు. వివిధ సంస్థలకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ తన బట్టతల మీద రాసుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక్కో యాడ్ కు 50వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు.. మొదట్లో హసీమ్ చేస్తున్న పని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత అతని వారితో చప్పట్లు కొట్టించింది.
చాలామంది జుట్టు ఊడిపోతుంటే బాధపడుతుంటారు. బట్టతల వస్తే బెంగ పడుతుంటారు. కానీ ఆ బట్టతలతో కూడా ఆదాయాన్ని సంపాదించవచ్చని.. ప్రకటనల ద్వారా వెనకేసుకోవచ్చని నిరూపించాడు హసీం. ఉపాయం ఉండాలే గాని అపాయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని.. లోపాన్ని కూడా అదృష్టంగా మలచుకోవచ్చని హసీం నిరూపించాడు. హసీం చేస్తున్న పనికి సంబంధించి మీమ్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. జట్టు లేకుండా డబ్బు సంపాదిస్తున్నావంటే నువ్వు గ్రేట్ అని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు.