Aggipette Macha: సోషల్ మీడియా లో ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ ఒక సంచలనం అనే చెప్పొచ్చు. ఎవరో ఒక యూట్యూబర్ , అతని వద్దకు వెళ్లి , అతన్ని విసిగించి పెట్టిన వీడియో బాగా వైరల్ అవ్వడం తో , అగ్గిపెట్టె మచ్చ సోషల్ మీడియా ప్రస్థానం మొదలైంది. ఆ వీడియో లో ఆయన మాట్లాడిన బూతులు ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ , ట్విట్టర్ , ఫేస్ బుక్ యాప్స్ లో మంచి మీమ్ మెటీరియల్ గా మారిపోయింది. సినిమాల్లో కూడా ‘అగ్గిపెట్టె మచ్చ’ డైలాగ్స్ బాగా వాడుకునేవారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో ఆయన పాపులారిటీ ని సంపాదించాడు అనేది. ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యాక , ప్రముఖ యూట్యూబర్స్ అందరూ మచ్చ ఇంటికి వెళ్లి, అతనితో స్పెషల్ గా కొన్ని వీడియోస్ చేసి , యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు.
అవి విపరీతంగా వైరల్ అయ్యేవి. ఇప్పటికీ కూడా ఆ వీడియోస్ ని మీమ్స్ కోసం ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ క్రేజ్ కారణంగా మచ్చ ని టీవీ షోస్ కి కూడా పిలిచేవారు. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ , ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా కనిపించాడు మచ్చ. ఇక ఆయన చేసిన సినిమాల్లో చెప్పుకోదగినది ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ఈ సినిమాలో అగ్గిపెట్టె మచ్చ ఒక చిన్న క్యారెక్టర్ చేసాడు. అలా మచ్చ కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయంలో , ఆరోగ్య సమస్యలు ఆయన్ని నెమ్మదించాయి. ఈమధ్య కాలం లో ఆయనకు సంబంధించిన కొత్త వీడియోలు సోషల్ మీడియా లో కనిపించక పోవడం తో , మచ్చ కి అసలు ఏమైంది ? అని అనుకున్నారు.
కొన్ని నెలల క్రితం ఆయనతో ఒక యూట్యూబర్ వీడియో చేయగా, ఆరోగ్యం సరిగా ఉండడం లేదని చెప్పుకొచ్చాడు మచ్చ. అవి సాధారణ ఆరోగ్య సమస్యలు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ నెల 5 వ తేదీన తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన నిన్న చనిపోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా అర్థ రాత్రి ఆయనకు విపరీతమైన తలపోటు రావడం తో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు ఆయన్ని పరీక్షించి , సర్జరీ అవసరం ఉండడం తో , సర్జరీ చేశారు. కానీ చివరికి కాపాడలేకపోయారు. అలా సోషల్ మీడియా లో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించిన అగ్గిపెట్టె మచ్చ తిరిగిరాని లోకాలకు ప్రయాణం సాగించాడు.
అగ్గిపెట్టె మచ్చ చనిపోవడానికి గల కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియా లో కొన్ని కథనాలు ప్రచారం లో ఉన్నాయి. కానీ ఆయన చనిపోవడానికి గల అసలు కారణం వేరే ఉంది. తనకు 21 ఏళ్ళ వయస్సు లోనే ఒక భారీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ రోడ్డు ప్రమాదం లో అగ్గిపెట్టె మచ్చ తలకు తీవ్రమైన గాయాలు అయ్యేవి. అప్పటి నుండి ఆయన తన అక్క ని తప్ప అందరినీ మర్చిపోయాడు. ఈ ప్రమాదానికి ముందు మచ్చ ఒక ఫోటో గ్రాఫర్ గా పనిచేసేవాడు. ప్రమాదం తర్వాత ఆ పనిని కూడా మర్చిపోయాడు. అప్పటి నుండి ఇలా తయారైన మచ్చ కి అప్పుడప్పుడు తలపోటు వస్తూనే ఉండేది. ఇప్పుడు అది విపరీతం అవ్వడం తో ఆయన చనిపోవాల్సి వచ్చింది. అయితే మచ్చ ని యూట్యూబర్స్ ఒక రేంజ్ లో వాడుకున్నారు అనే చెప్పాలి. తనకి ఉన్న పరిస్థితుల్లో గట్టిగా అరవడాలు, కోపం తెచ్చుకోవడాలు వంటివి చేయకూడదు. కానీ యూట్యూబర్లు వైరల్ కంటెంట్ కోసం , అతని వద్దకు వెళ్లి , బాగా రెచ్చగొట్టి, బూతులు తిట్టించేలా చేస్తారు.
ఆ వీడియోల్లో మచ్చ ఆవేశం చూసి , ఇలా అరుస్తున్నాడేంటి , స్పృహ తప్పి క్రింద పడిపోతాడేమో అని అనుకునేవారు. ఇలా ఆయన్ని రెచ్చగొట్టి కంటెంట్ చేయించుకోవడం అలవాటు గా మారడం వల్లే , మచ్చ నేడు చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అయ్యుండొచ్చు అని అంటున్నారు నెటిజెన్స్. మచ్చ తో వీడియోస్ చేయించుకునే యూట్యూబర్స్ రోజుకి 10 వేల రూపాయిలు ఇచ్చేవారట. గతం లో రాకేష్ మాస్టర్ అగ్గిపెట్టె మచ్చ తో పాటు , సోషల్ మీడియా లో ఆయన లాగా పాపులారిటీ ని సంపాదించిన వాళ్ళతో కలిసి ఒక మినీ బిగ్ బాస్ లాంటి ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసాడు. ఈ ఎపిసోడ్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇది పూర్తి అయ్యాక రాకేష్ మాస్టర్ చనిపోయాడు. ఆ తర్వాత మచ్చ ఇలా చనిపోవడం బాధాకరం. అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ చనిపోవడం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.