Homeవైరల్ వీడియోస్Viral Video : కష్టపడి చెమటోడ్చితే.. మన గుండు తుడవడానికి ఒకరుంటారు భయ్యా.. వైరల్ వీడియో

Viral Video : కష్టపడి చెమటోడ్చితే.. మన గుండు తుడవడానికి ఒకరుంటారు భయ్యా.. వైరల్ వీడియో

Viral Video :  సామాన్యులకైతే కష్టాలు వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు, స్నేహితులు అండగా ఉంటారు. ధైర్యాన్ని చెబుతుంటారు. అదే శ్రీమంతులకు వస్తే అందరూ ముందుకు వస్తారు. అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లలిత జ్యువెలర్స్ (Lalitha jewellers ) తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. నెల్లూరులో పుట్టిన కిరణ్ కుమార్ (Kiran Kumar) అనే వ్యక్తి 1985లో చెన్నై కేంద్రంగా లలిత జ్యువెల్లర్స్ ను ఏర్పాటు చేశారు. నేడది తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరించింది. తమిళనాడులోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. లలిత జ్యువెలర్స్ ఇటీవల తన కార్యాలయాన్ని ఖమ్మంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ హాజరయ్యారు. కిరణ్ కుమార్ తనకు తానే ఒక బ్రాండ్ ను గుర్తుంచుకున్నారు. డబ్బులు ఊరికే రావు అంటూ తెలుగు వారికి సుపరిచితమైపోయారు. మిగతా జువెలరీ సంస్థలు హీరోలను, హీరోయిన్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటే.. కిరణ్ కుమార్ మాత్రం తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. తన సంస్థను విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే అటువంటి వ్యక్తి ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ బ్రాంచ్ ను ప్రారంభించారు.

చెమటను తుడిచారు

లలిత జ్యువెలర్స్ అధినేత బోడి గుండుతో ఉంటారు. దానికి తగ్గట్టుగా కళ్లద్దాలు పెట్టుకుంటారు. సాధారణ డ్రెస్ లోనే కనిపిస్తారు. ఆయన ఖమ్మంలో ఇటీవల షోరూం ప్రారంభించడానికి వచ్చినప్పుడు విపరీతంగా ఎండ ఉంది. ఆ సమయంలో కిరణ్ కుమార్ గుండుకు చెమట పట్టింది. దీంతో పక్కనే ఉన్న ఒక మహిళ ఆయన గుండుకు పట్టిన చెమటను కర్చీఫ్ తో తుడిచింది. దీనిని అక్కడే ఉన్న కొంతమంది యువకులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. కిరణ్ కుమార్ సెలబ్రిటీ కావడం.. ఆయన ప్రారంభించింది లలిత జ్యువెలర్స్ కావడంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అంతేకాదు మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో మన గుండుకు చెమట పడితే తుడవడానికి ఒకరుంటారు లేదో తెలియదు.. కానీ కిరణ్ కుమార్ గుండుకు చెమట పడితే మాత్రం తుడవడానికి లైన్ లో చాలామంది ఉన్నారు. అందుకే డబ్బుంటేనే బాగుంటుంది. చివరికి మన గుండుకు అంటిన చెమటను కూడా ఇంకొకరు తుడవడానికి వీలుంటుంది. ఎంతైనా లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ అదృష్టవంతుడు. చివరికి తన గుండుకు పట్టిన చెమటను కూడా ఇంకొకరికి చెప్పకుండానే తుడిపించుకుంటున్నాడని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by MyWorld (@i_love_palvancha)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper