Homeబిజినెస్Weekend Business: వారానికి రెండు రోజులు పని.. నెలకు నాలుగు లక్షల ఆదాయం..

Weekend Business: వారానికి రెండు రోజులు పని.. నెలకు నాలుగు లక్షల ఆదాయం..

Weekend Business: శీర్షిక చదివారు కదా.. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా.. ఇంత స్థాయిలో సంపాదన ఎలా వస్తుందనే అనుమానం మీలో ఉంది కదా.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేస్తున్నారా.. అందువల్లే ఇంత స్థాయిలో ఆదాయం వస్తుందేమో అనుకుంటున్నారు కదా.. అదంతా కాదు.. వారంలో రెండు రోజుల పని చేస్తే.. నాలుగు లక్షల ఆదాయం అంటే అది మామూలు విషయం కాదు. దీనిని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ […]

Weekend Business: శీర్షిక చదివారు కదా.. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా.. ఇంత స్థాయిలో సంపాదన ఎలా వస్తుందనే అనుమానం మీలో ఉంది కదా.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా చేస్తున్నారా.. అందువల్లే ఇంత స్థాయిలో ఆదాయం వస్తుందేమో అనుకుంటున్నారు కదా.. అదంతా కాదు.. వారంలో రెండు రోజుల పని చేస్తే.. నాలుగు లక్షల ఆదాయం అంటే అది మామూలు విషయం కాదు. దీనిని నిరూపించాడు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు.

ఆ యువకుడు పేరు నందన్. ఇతడు ఉండేది బెంగళూరులో. వయసు 22 సంవత్సరాలు.. ఇతడు అన్ టెయిమ్డ్ స్ట్రీట్ వేర్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తు పట్టించుకుంటున్నారు. కేవలం వీకెండ్ లో అమ్మకాలు చేపట్టడం ద్వారా ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడు. ఇతడు ఓవర్ సైజు టీ షర్టులు.. హుడీలు అమ్ముతున్నాడు. నెలకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నాడు.. డిజైనింగ్.. మార్కెటింగ్ వరకు అన్ని పనులు ఇతడు చేస్తున్నాడు. యువత ఆకట్టుకునే విధంగా దుస్తులను రూపొందించి విక్రయిస్తున్నాడు.

నేటి యువత విదేశీ బ్రాండ్లకే విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది. అయితే ఆ బ్రాండ్లకు తగ్గట్టుగానే క్వాలిటీ.. మైంటైన్ చేస్తూ నందన్ యువతను ఆకట్టుకుంటున్నాడు. కేవలం వీకెండ్స్ లోనే ఇతడు చిన్న కార్ట్ పై ఓవర్ సైజ్ టీ షర్టులు.. హుడీస్ అమ్ముతున్నాడు. తద్వారా నెలకు 4 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. డిజైనింగ్.. సోర్సింగ్.. మార్కెటింగ్.. ఇలా ప్రతి పనిని తనే స్వయంగా చూసుకుంటున్నాడు. అంకితభావంతో ముందుకు వెళ్తున్నాడు. యువత విదేశీ బ్రాండ్లను విపరీతంగా ఇష్టపడుతున్న నేపథ్యంలో.. వారి దృష్టిని తన బ్రాండ్ల వైపు మళ్ళించుకున్నాడు నందన్. తన స్వశక్తి.. పట్టుదలతో ఈ స్థాయి దాకా వచ్చాడు. సరైన గుర్తింపు లభిస్తే.. ప్రోత్సాహం దక్కితే.. దేశీయ ఫ్యాషన్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తానని నందన్ చెబుతున్నాడు.

నందన్ వారానికి రెండు రోజులు తన ఉత్పత్తులు అమ్ముతుంటాడు. ప్రతిరోజు రెండు లక్షలకు తగ్గకుండా విక్రయాలు చేపడుతుంటాడు. యువత కోరుకున్న దుస్తులను రూపొందించే అతడు.. కొన్ని సందర్భాలలో డోర్ డెలివరీ కూడా చేస్తుంటాడు. కాకపోతే ఒకే చోట ఉండకుండా.. బెంగళూరులో వీకెండ్స్ లో జనం బాగా ఉండే ప్రాంతాలలో దుస్తులు అమ్ముతుంటాడు. అది కూడా ఉదయం పూటనే తన కార్ట్ ఓపెన్ చేస్తాడు. తద్వారా దండిగా సంపాదిస్తుంటాడు. ఖర్చులు.. మిగతావన్నీ పోను అతనికి రోజుకు 20 నుంచి 30 వేల వరకు మిగులుతాయని చెబుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper