murderd
యువతి ప్రేమించలేదంటూ ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురలో ఓ యువకుడు దివ్య తేజస్విని అనే యువతి ఇంటికి వెళ్లి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా యువుకుడు సైతం తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. గాయపడిన యువకుడిని ఇదే అసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై మాచవరం పోలీస్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Young woman stabbed to death in vijayawada
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com