Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada YCP: అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తే రాజకీయాలకు దూరం కావాల్సిందే!

Vijayawada YCP: అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తే రాజకీయాలకు దూరం కావాల్సిందే!

Vijayawada YCP: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి ఇప్పటికీ ఒక లోటు ఉంది. రాష్ట్రమంతటా గెలిచామని ఆ పార్టీ భావిస్తోంది. కానీ ఓ మూడు చోట్ల మాత్రం ఆ పార్టీకి ఇప్పటివరకు విజయం దక్కలేదు. జగన్ ప్రభంజనంలో సైతం ఆ మూడు చోట్ల టిడిపి విజయం సాధించింది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది. కానీ ఆ ప్రయోగాలు ఏవి ఫలించలేదు. ఎప్పటికప్పుడు […]

Vijayawada YCP: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి ఇప్పటికీ ఒక లోటు ఉంది. రాష్ట్రమంతటా గెలిచామని ఆ పార్టీ భావిస్తోంది. కానీ ఓ మూడు చోట్ల మాత్రం ఆ పార్టీకి ఇప్పటివరకు విజయం దక్కలేదు. జగన్ ప్రభంజనంలో సైతం ఆ మూడు చోట్ల టిడిపి విజయం సాధించింది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రయోగాలు చేసింది. కానీ ఆ ప్రయోగాలు ఏవి ఫలించలేదు. ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చింది. ఆ మార్పు ఎంతవరకు కూడా లాభం చేకూర్చలేదు. పైగా ఎంపీలుగా పోటీ చేసిన వైసీపీ నేతలకు అడ్రస్ లేకుండా పోయింది. రాజకీయ జీవితం లేకుండా పోయింది. ముఖ్యంగా విజయవాడ నుంచి పోటీ చేసిన ముగ్గురు నేతలు వైసీపీలో లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ చిక్కడం లేదు. విజయవాడలో పోటీ అంటేనే నేతలు భయపడిపోతున్నారు.

* తొలి ఎన్నిక నుంచి..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతారని భావించి.. పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ ను ( Koneru Prasad ) రంగంలోకి దించింది. అంతకు ముందు రెండు ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంటుందని భావించింది. కానీ వైసీపీ లెక్కలు తప్పాయి. టిడిపి అభ్యర్థి కేసినేని నాని ఘనవిజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల తరువాత కోనేరు ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పారు.

* ప్రభంజనంలో సైతం..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అప్పట్లో కూడా విజయవాడ పార్లమెంటు స్థానం దక్కించుకోలేకపోయింది. రెండోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని ఇక్కడ ఘనవిజయం సాధించారు. ఆర్థిక బలం ఉన్న పొట్లూరు వరప్రసాద్ ను రంగంలోకి దించింది. ఆయన ప్రముఖ నిర్మాతగా కొనసాగుతుండగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్. అయితే రాష్ట్రమంతటా ప్రభంజనం వీచింది కానీ .. విజయవాడలో మాత్రం టిడిపి అభ్యర్థి కేసినేని నాని గెలిచి పట్టు నిలుపుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పొట్లూరు వరప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. క్రమేపి రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పారు.

* కేశినేని నాని సైతం..
2024 ఎన్నికల్లో అనూహ్యంగా రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని( Nani) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతకుముందు రెండుసార్లు గెలిచేసరికి అదంతా తన చరిష్మ అన్నట్టు భావించారు. అయితే ఆయన పై టిడిపి అభ్యర్థిగా తమ్ముడు కేసినేని చిన్ని పోటీ చేసి గెలిచారు. దీంతో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. అయితే విజయవాడలో పోటీ చేస్తున్న వారంతా ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ గా మారింది. అక్కడ పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper