Maoists In Vijayawada: విజయవాడ( Vijayawada) నగరంలో పట్టుబడ్డారు 27 మంది మావోయిస్టులు. ఇంటెలిజెన్స్ సమాచారంతోనే వారిని పట్టుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. కానీ మావోయిస్టులు చేసిన చిన్న తప్పిదం వల్లే వారు పట్టు పడడం విశేషం. చత్తీస్గడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు దాడులతో పాటు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో సైతం పోలీసుల గాలింపులు అధికంగా ఉంది. ఇటువంటి తరుణంలో ఏపీలో తలదాచుకునేందుకు వచ్చిన మావోయిస్టులకు ఇటీవల ఎదురు దెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు సైతం చనిపోయారు. అదే సమయంలో విజయవాడ నగరంతో పాటు కాకినాడలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పట్టు పడడం విశేషం.
* లక్ష రూపాయల అద్దెతో..
విజయవాడ ఆటోనగర్( Autonagar ) ప్రాంతంలో మావోయిస్టులు పట్టుబడడం మాత్రం సంచలనం రేగింది. ఆ ప్రాంతంలో ఆటో కార్మికులు అధికం. రవాణా రంగానికి సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆటోనగర్ శివారు ప్రాంతంలోని ఒక భవనంలో ఏకంగా 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు. అయితే వీరు పట్టు పడడం వెనుక వీరి వైఫల్యం ఉంది. ఆ భారీ భవనంలో కింది వర్షన్ వ్యాపార అవసరాలకు అద్దెకు ఇచ్చారు సదరు యజమాని. పై పోర్షన్ అంతా ఓపెన్ హాల్. గత కొద్ది నెలలుగా ఆ హాల్ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో అక్కడ హాల్ ను అద్దెకు తీసుకున్నారు కొంతమంది. ఏకంగా లక్ష రూపాయలకు అద్దెకు తీసుకోవడం ఆ ప్రాంతంలో చర్చకు దారి తీసింది. కొద్ది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ భవనం ఏకంగా లక్షలు అద్దెకు వెళ్లడంతో స్థానికులు చర్చించుకోవడం ప్రారంభించారు. ఆ నోటా ఈ నోటా విన్న పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు.
* తేలిగ్గా ఆలోచించిన మావోయిస్టులు
అయితే మావోయిస్టులు( mavoyists) అంత ఈజీగా ఎలా ఆలోచించారో తెలియడం లేదు. ఎందుకంటే ఒకే భవనంలో అంతమంది అద్దెకు దిగితే కచ్చితంగా అనుమానం వస్తుంది. ఆపై ఒకే భవనంలో 27 మంది దిగితే అసాంఘిక కార్యకలాపాల విషయంలో అనుమానం వస్తుంది. ఆపై లక్ష రూపాయల అద్దెకు దిగడం అంటే దీని వెనుక ఏదో ఒకటి ఉందన్న అనుమానం వెంటాడుతుంది. పోలీసులు సైతం ఆ అనుమానంతోనే కూపీ లా గారు. మావోయిస్టులు అన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ భవనాన్ని చుట్టుముట్టి చాలా తేలిగ్గా 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకోగలిగారు.