ఏలూరులో వింత వ్యాధితో బాధితులు పెరుగుతున్నారు. మరోవైపు ఈ వ్యాధిని కనుక్కోవడానికి ఏయిమ్స్ వైద్యులు శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నారు. అయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. పరిశుభ్రమైన నీటిని పొందడం మానవ హక్కు అని, అలాంటి నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏలూరులో నీటి కలుషితం తీవ్రమైందని,ఈ ఘటనపై విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇక ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి దేశంలోని అనేక ఇనిస్టిట్యూట్ ల నుంచి వైద్య బ్రుందాలు వస్తున్నాయని ఏవీఆర్ మోహన్ తెలిపారు. ప్రస్తతం కొత్త కేసులు తగ్గుతున్నాయన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Complaint to the nhrc over the eluru incident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com