Causes of poor health: కొంతమంది నిన్నటి వరకు బాగానే ఉన్నాం.. కానీ ఇప్పుడే తమకు ఏదో అవుతుంది అన్నట్లుగా ఆందోళన చెందుతారు. అంతేకాకుండా మరికొందరు ఏదో ఆలోచిస్తూ అనుకోకుండానే అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే అనారోగ్యం రావడానికి ప్రధాన కారణం ఆలోచనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అవసరం లేని కొన్ని కొత్త కోరికలు కోరుకొని.. వాటికోసం తీవ్రంగా కష్టపడి.. శక్తికి మించి పనిచేసి శరీరాన్ని అలసట కు గురయ్యేలా చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతారు. ఇది ఒక వైపు అయితే మరోవైపు అనారోగ్యం ఏర్పడడానికి మరో కారణం ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: 20 ఏళ్ల వయసు ఉన్నవారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
ఒకప్పుడు ఎవరి చేతిలో మొబైల్ ఉండేది కాదు.. ఏదైనా అవసరం ఉంటే మనుషుల ద్వారా పనులు చేసుకునేవారు. దీంతో మనుషుల మధ్య కమ్యూనికేషన్ నుండి స్వచ్ఛమైన వాతావరణ ఉండేది. కానీ మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరితో ఎవరు మాట్లాడే సమయం లేకుండా పోయింది. ఫలితంగా ప్రతి విషయం కోసం మొబైల్ ను ఆశ్రయిస్తూ.. తలనొప్పి తెచ్చుకుంటున్నారు. అయితే మొబైల్ ప్రస్తుతం అవసరమే.. కానీ కూర ఎలా వండాలో కూడా మొబైల్ ని ఆశ్రయించడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే సొంతంగా కూరను తయారు చేయకుండా కేవలం ఎదుటివారు మొబైల్లో చేసిన విధంగానే మనం కూడా వండుకోవాలని అనుకుంటున్నాము. అయితే వారి పరిస్థితిలా అనుగుణంగా వారు కూరలు వండితే.. ఇతర వాతావరణంలో ఉండే వారు కూడా అదే ఫాలో అయి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.
అలాగే మనసులోని కోరికలు కూడా అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు కావాలని అనుకున్నప్పుడు ఆ వస్తువు మాత్రమే కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది సూపర్ మార్కెట్, తదితర షోరూమ్ లోకి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. ఇక్కడికి వెళ్లిన తర్వాత కేవలం ఒక వస్తువుతో ఆగిపోకుండా మిగతా ఆకర్షణీయమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇలా తమ దగ్గర డబ్బులు లేకున్నా స్థాయికి మించి ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులు తీర్చలేక బాధపడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. అంటే అవసరానికి మించి పనులు చేస్తూ శరీరాన్ని అలసటకు గురి చేస్తున్నారు.
Also Read: ఏఐ గన్స్ వచ్చేశాయి.. ఇక కశ్మీర్ లో పాక్, చైనాకు దబిడదిబిడే.
ఇవే కాకుండా ఎన్నో కోరికలు మనసులోకి తెచ్చుకొని శక్తికి మించి పనులు చేస్తున్నారు. అయితే కోరికలను అదుపులో పెట్టుకోవడంతోపాటు.. మన స్థాయి ఏంటో తెలుసుకొని అందుకు అనుగుణంగా మాత్రమే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏ సమస్య ఉండదు. కానీ అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా.. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోతే డబ్బులు వృధా అవ్వడమే కాకుండా మనసు ఆందోళనకు గురవుతుంది. అందువల్ల డబ్బు ఖర్చు విషయంలో కేవలం అవసరానికి మాత్రమే ఉంచుకోవాలని.. అప్పుడే ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు.