తన ప్రేయసి కోసం ఓ ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రేయసికి ఆమె తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలిపాడు. దీంతో పోలీసులు అప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకున్న కళ్యాణ మండపంకు వెళ్లి విచారించడంతో ప్రేయసి అసలు విషయం చెప్పింది. దీంతో ఆ పెళ్లి ఆగింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పీలేరు మండలం గుర్రంకొండలో ఓ యువతికి నిన్న అర్ధరాత్రి వివాహం చేసేందుకు నిశ్చయించారు. అయితే మరో గంటలో వరుడు తాళికట్టే సమయంలో కల్యాణ మండపానికి పోలీసులు వచ్చారు. అప్పటికే ఆ యువతనిని ప్రేమించిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో , పోలీసులతో కలిసి ప్రియుడు కల్యాణ మండపానికి వచ్చాడు. ఆ తరువాత విచారించారు. దీంతో ఆ యువతి సదరు ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పింది నిజమేనని చెప్పడంతో ఆ పెళ్లి ఆగిపోయింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Complaint to police for lover stopped marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com