Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: మీకో దండం మమ్మల్ని వదిలేయండి.. పైసలు ఇస్తే పోటీ సంగతి...

YS Jagan Mohan Reddy: మీకో దండం మమ్మల్ని వదిలేయండి.. పైసలు ఇస్తే పోటీ సంగతి చూద్దాం..జగన్ కు ఇవేం షరతులు

YS Jagan Mohan Reddy: యుగానికి ఒక్కడు సినిమా చూశారా..అందులో ‘మీకో దండం. మా డబ్బులు మాకిస్తే వెళ్లిపోతాం’అని కార్తీ ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. ఇప్పుడు వైసీపీలో దిగువస్థాయి నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని చెబితే చాలు.. పై డైలాగ్ ను వారు వల్లె వేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో వైసిపి కొనసాగినప్పుడు… తాడేపల్లి ప్యాలెస్ నిత్యం కిటకిటలాడుతూ ఉండేది. జగన్ కిందికి వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా సరే.. సజ్జలను […]

YS Jagan Mohan Reddy: యుగానికి ఒక్కడు సినిమా చూశారా..అందులో ‘మీకో దండం. మా డబ్బులు మాకిస్తే వెళ్లిపోతాం’అని కార్తీ ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. ఇప్పుడు వైసీపీలో దిగువస్థాయి నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని చెబితే చాలు.. పై డైలాగ్ ను వారు వల్లె వేస్తున్నారు.

ఒకప్పుడు అధికారంలో వైసిపి కొనసాగినప్పుడు… తాడేపల్లి ప్యాలెస్ నిత్యం కిటకిటలాడుతూ ఉండేది. జగన్ కిందికి వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా సరే.. సజ్జలను మాత్రమే కలిసి వెళ్లేవారు. ఆ తర్వాత మిగతా కథ మొత్తం సజ్జల చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయనప్పటికీ జగన్ వీక్లీ ఫోర్ డేస్ వర్కింగ్ మెథడ్ మాత్రమే ఫాలో అవుతున్నారు. సోమవారం తాడేపల్లి ప్యాలెస్ కు జగన్ వస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన రాలేదు. కేవలం ట్విట్టర్ లోనే ఆయనను చూసుకునే భాగ్యం కార్యకర్తలకు దక్కింది.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమిలో ఒక్కో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. కొన్ని సందర్భాలలో ఎవరిని పోటీలో పెట్టాలో కూడా తెలియని పరిస్థితి కూటమికి ఉంది. వాస్తవానికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ కూడా టిడిపిలో ఇదే స్థాయిలో వాతావరణం కనిపించింది. ఎందుకంటే నాడు దిగువ స్థాయి కార్యవర్గాన్ని కాపాడుకోవడానికి టిడిపి అధిష్టానం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ఇబ్బందులు పెట్టినప్పటికీ.. హింస పెట్రేగిపోయినప్పటికీ టిడిపి అధిష్టానం వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలను కాపాడుకుంది. నాయకత్వంలో భరోసానింపింది. అందువల్లే నాడు జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసిపి హింసను తట్టుకొని టిడిపి ఆస్థాయిలో స్థానాలు సంపాదించుకోగలిగింది.

నేడు టిడిపి ఆస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదు. ఇబ్బంది పెట్టడం లేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అడుగులు వేస్తోంది. అయినప్పటికీ వైసీపీ నుంచి పోటీ చేయడానికి పెద్దగా నాయకులు ఆసక్తి చూపించడం లేదు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఇప్పటివరకు వారు కోలుకోలేదు. పైగా బీసీలకు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. సమాజంలో సగభాగంగా ఉన్న బీసీలకు అండగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇది వైసిపి నాయకులకు ఇబ్బందికరంగా మారింది. అందువల్లే వారు పోటీ చేయడానికి వెనుకాడుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకుని పోటీ చేయడం తమ వల్ల కాదని నాయకులు చేతులెత్తేస్తున్నారు. అధిష్టానం ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తేనే పోటీ చేయడానికి అవకాశాలను పరిశీలిస్తామని వారు చెబుతున్నారు. ఇది ఒకరకంగా జగన్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కిందిస్థాయి కార్యకర్తలను వైసిపి అధిష్టానం పట్టించుకోలేదు. కొంతమంది నాయకుల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పని చేసింది. ఇప్పుడు వారంతా చేతులెత్తేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇవ్వాల్సిన తరుణంలో.. కింది స్థాయి కార్యకర్తలకు అండగా లేకుండా పోతున్నారు. దీంతో అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. అందువల్లే సోమవారం తాడేపల్లి ప్యాలెస్ కి జగన్ రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అధిష్టానం ఆర్థిక సహాయం చేయని పక్షంలో పోటీ చేసేది లేదని చాలామంది నాయకులు తెగేసి చెబుతున్నారట. కాకపోతే అధిష్టానం షరతులు విధిస్తున్న నేపథ్యంలో చాలామంది పార్టీ నుంచి వీడి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారట. మరోవైపు కూటమిలో మాత్రం సమరోత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper