Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party Election Allegations: టిడిపిది ఈవీఎంల విజయం.. నిరూపించేందుకు వైసీపీకి ఛాన్స్!

YSR Congress Party Election Allegations: టిడిపిది ఈవీఎంల విజయం.. నిరూపించేందుకు వైసీపీకి ఛాన్స్!

YSR Congress Party Election Allegations: 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఈ ఓటమి వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. జాతీయస్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లింది. అయితే ఆ పార్టీ మాట ఎలా ఉంది అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏమీ అనడం లేదు. రాష్ట్రంలో కూటమి గెలుపును మాత్రం అనుమానిస్తోంది. దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. […]

YSR Congress Party Election Allegations: 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఈ ఓటమి వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. జాతీయస్థాయిలో కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లింది. అయితే ఆ పార్టీ మాట ఎలా ఉంది అంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏమీ అనడం లేదు. రాష్ట్రంలో కూటమి గెలుపును మాత్రం అనుమానిస్తోంది. దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. జాతీయస్థాయిలో కూడా గళం ఎత్తింది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి అరుదైన ఛాన్స్ వచ్చింది. ఇదే రకం అనుమానంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇది నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం. అయితే ఆ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

* విపక్షాలన్నీ ఉమ్మడిగా..
జాతీయస్థాయిలో విపక్షాలు స్పీకర్ పై అభిశంసన తీర్మానాన్ని ఉమ్మడిగా పెట్టాయి. అయితే ఇప్పటివరకు ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించాయి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత విధానంలో ముందుకు వెళ్తుందా? లేకుంటే బిజెపి వ్యతిరేక పక్షాలతో చేతులు కలుపుతుందా అన్నది చూడాలి. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయని.. 51 లక్షల ఓట్లపై స్పష్టత లేదని రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు నిలదీశారు. ఇప్పుడు అదే ఈసీ పై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చాయి. ఈ తరుణంలో వైసిపి ఆ తీర్మానానికి మద్దతు ఇస్తుందా? లేదా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

* మద్దతు తెలపకుంటే మాట్లాడలేదు..
ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈవీఎంల టెంపరింగ్ అంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. బాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న ఆ పార్టీ ఇప్పుడు సీఈసీని తొలగించే ప్రక్రియలో.. భాగస్వామి కాకుంటే మాత్రం ఆ పార్టీ చెప్పే విలువలపై అనుమానాలు, సందేహాలు తలెత్తుతాయి. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే.. లేకుంటే గైర్ హాజరైతే.. ఇకనుంచి ఎన్నికల అక్రమాలపై నిలదీసే అవకాశమే ఉండదు. తమ ఓటమికి ఈసీనే కారణమని భావిస్తున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు విపక్షాలు ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి పని చేయాల్సిందే. ఇప్పటికే 193 మంది ఎంపీలు ఈ నోటీసు పై సంతకాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇస్తే కేంద్రం పై ఒత్తిడి పెరుగుతుంది. కానీ వైసిపి అంతటి సాహసం చేస్తుందా? బిజెపికి ఎదురెళ్లే ధైర్యం చేస్తుందా? అలా చేస్తే బీజేపీ ఊరుకుంటుందా? అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper