RK Kotha Paluku: ఈసారి చంద్రబాబు ప్రస్తావన లేదు. రేవంత్ రెడ్డి కి భుజ కీర్తి తొడగలేదు. జగన్ మీద విమర్శ చేయలేదు.. ఇదేంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా మారిపోయాడు.. అనుకుని కొత్త పలుకు చదువుతూ ఉంటే ఆశ్చర్యమనిపించింది. ఆ తర్వాత ఈ సీనియర్ జర్నలిస్ట్ ఏంటి ఇలా మారిపోయాడు అనిపించింది. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
కొత్త పలుకులో ఈసారి రాధాకృష్ణ మొత్తం మోడీ నామ జపానికి పరిమితమైపోయారు. నరేంద్ర మోడీ ఇప్పట్లో రిటైర్ కారని.. రిటైర్ అయ్యే అవకాశాలు కూడా లేవని.. ఆయన దేశ రాజకీయాలలో ఒక సమున్నతమైన పాత్ర పోషించాలనుకుంటున్నారని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. ఇటీవల రేవంత్ రెడ్డి మీరు ప్రధానమంత్రి కావాలని రాహుల్ కు సూచించడం.. దానికి రాహుల్ ఒప్పుకోవడం వంటి పరిణామాలు జరిగిన నేపథ్యంలో.. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు చర్చకు దారి తీస్తోంది.
మనదేశంలో ఇందిరా గాంధీ.. నెహ్రూ ఎక్కువ కాలం పని చేసిన ప్రధాన మంత్రులుగా రికార్డులు సృష్టించారు. అయితే వారికి మించి ప్రధానమంత్రిగా పనిచేయాలని.. ఈ దేశంలో ఎక్కువ రోజులపాటు పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించాలని నరేంద్ర మోడీ అనుకుంటున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తొక్కిపెట్టాలని.. అందువల్లే జమిలి ఎన్నికల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని రాధాకృష్ణ రాసి పడేశారు.
నరేంద్ర మోడీ గురించి రాసుకుంటూనే.. కెసిఆర్ మీద ఉన్న తన అక్కసును రాధాకృష్ణ బయటపెట్టారు. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే ప్రధాన పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య ఉంటుందని.. కెసిఆర్ లాంటి ప్రాంతీయ నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని ముగించాల్సి ఉంటుందని.. అందువల్లే కేసీఆర్ బిజెపితో పొత్తు కోసం రాయబారాలు పంపుతున్నారని రాధాకృష్ణ రాసేశారు.
జమిలి ఎన్నికలు జరిగితే కెసిఆర్ కు ఎంత ఇబ్బంది ఉంటుందో.. చంద్రబాబుకు కూడా అంతే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం కూటమిలో బిజెపి ఉంటే ఉండవచ్చు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో టిడిపి కొనసాగుతూ ఉండవచ్చు. రాజకీయాలలో పొత్తులు ఎప్పటికీ స్థిరంగా నిలబడవు. ఉదాహరణకు 2014 ఎన్నికల్లో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత తెగ దెంపులు చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఏపీకి వరాలిస్తున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే.. బిజెపికి వన్ సైడ్ సపోర్ట్ లభిస్తే అప్పుడు టిడిపి పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయాడు. కేవలం కెసిఆర్ నెగటివ్ కోణంలో మాత్రమే రాసుకుంటూ వచ్చాడు. అందువల్లే విశ్లేషణ చేస్తున్నప్పుడు అన్నివైపులా చూడాలి. అలాకాకుండా ఏకపక్షంగా రాసుకుంటూ పోతే ఇదిగో ఇటువంటి రుచిపచి లేని విశేషణ లాగా ఉంటుంది.. రాధాకృష్ణ సార్.. మిస్సైల్ అంటే మీ విశ్లేషణలు ఇలా మారిపోతున్న ఎందుకు.. రాసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదేమో..
