Homeఆంధ్రప్రదేశ్‌AP Rains: ఉరుములు, మెరుపులు.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rains: ఉరుములు, మెరుపులు.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rains: సమ్మర్ ప్రారంభం అయ్యింది. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సంక్రాంతి తర్వాత ఎండలు ముదురుతూ వచ్చాయి. మార్చి మొదటి వరానికి వచ్చేసరికి 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ ఏడాది వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్ష సూచన రావడం విశేషం. అది కూడా ఏపీతోపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. […]

AP Rains: సమ్మర్ ప్రారంభం అయ్యింది. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సంక్రాంతి తర్వాత ఎండలు ముదురుతూ వచ్చాయి. మార్చి మొదటి వరానికి వచ్చేసరికి 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ ఏడాది వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్ష సూచన రావడం విశేషం. అది కూడా ఏపీతోపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత కనిపిస్తోంది.

Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

* కొనసాగుతున్న ద్రోణి
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది చురుగ్గా కదులుతోంది. ఇది మరింత విస్తరించేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు చత్తీస్గడ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

* విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు..
అయితే ప్రస్తుతం వేసవి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ హెచ్చరికలు రావడం ఉపశమనం కలిగించే విషయం. అయితే గత రెండు రోజులుగా భారీ గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ఈ ద్రోణి ప్రభావంతో బలమైన కాలులతో పాటు ఉరుములు, మెరుపులు, ఆపై పిడుగులు పడే అవకాశం ఉందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకొస్తోంది. అందుకే రైతులతోపాటు పశువుల పెంపకం దారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. హోర్డింగులు, కటౌట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper