Homeలైఫ్ స్టైల్Reels addiction : పదేపదే షార్ట్స్ చూస్తున్నారా..? ఇది మాయం?

Reels addiction : పదేపదే షార్ట్స్ చూస్తున్నారా..? ఇది మాయం?

Reels addiction :  ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే దీనిని కేవలం అవసరాలకే కాకుండా కాలక్షేపానికి కూడా చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా పదేపదే స్క్రీన్ ను చూడడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. ముఖ్యంగా మొబైల్ లో షార్ట్ వీడియోలు, రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల వినోదాన్ని పొందుతున్నామని అనుకుంటున్నారు. కానీ గంటల తరబడి వీటిని చూడడం వల్ల తెలియకుండానే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్న […]

Reels addiction :  ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే దీనిని కేవలం అవసరాలకే కాకుండా కాలక్షేపానికి కూడా చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా పదేపదే స్క్రీన్ ను చూడడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. ముఖ్యంగా మొబైల్ లో షార్ట్ వీడియోలు, రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల వినోదాన్ని పొందుతున్నామని అనుకుంటున్నారు. కానీ గంటల తరబడి వీటిని చూడడం వల్ల తెలియకుండానే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్న విషయం గుర్తించడం లేదు. ఇలా గంటల తరబడి షార్ట్స్ ఏం జరుగుతుందో తెలుసా?

ఏదైనా ఒక విషయాన్ని చిన్నగా చేసి వీడియో రూపంలో అందించే దానిని షార్ట్ అంటారు. షార్ట్స్ ద్వారా ఒక విషయాన్ని పూర్తిగా వివరించవచ్చు. చాలామంది షార్ట్స్ చేసి సమాచారాన్ని అందిస్తున్నారు. కొందరు వినోదాత్మక వీడియోలు చేస్తున్నారు. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడంతో వీటికి చాలామంది అడిక్టు అయిపోయారు. దీంతో కొంతమంది ప్రతిరోజు కొన్ని షాట్స్ చూడకుండా ఉండలేకపోతున్నారు. మరికొందరు ఏదైనా విషయాన్ని తెలుసుకునేందుకు షార్ట్స్ లోనే సెర్చ్ చేస్తున్నారు.

అయితే ఒకదాని వెంట ఒకటి ఈ షార్ట్స్ చూడడం వల్ల మెదడుకు ప్రత్యేక పనిని కలిగించినట్లు అవుతుంది. ముఖ్యంగా ఒక వీడియో పూర్తయ్యలోపు మరో వీడియో మన ముందుకు వస్తుంది. ఇలా వెంట వెంటనే వీడియో రావడం వల్ల ఏదేని ఒకదానిపై ఎక్కువసేపు ఉండే అవకాశం ఉండదు. ఆ తర్వాత మిగతా విషయాల్లో కూడా వెంటవెంటనే కావాలని అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏకాగ్రత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. షార్ట్స్ ఎక్కువగా చూసే పిల్లవాళ్ళలో ఏకాగ్రత కోల్పోతుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక పుస్తకంలో ఎక్కువసేపు చదవడం లేదా ఒక ముఖ్యమైన పనిని ఎక్కువ సేపు చేయడం షార్ట్స్ చూడడం వల్ల తప్పుతుందని అంటున్నారు. ఇది క్రమంగా జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే నిరంతరం షార్ట్స్ చూడడం వల్ల ఆందోళన పెరగడంతో పాటు ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవ జీవితానికి వ్యతిరేకంగా అన్ని విషయాలు కనిపిస్తాయి. చురుకుదనం తగ్గి కొత్తగా ఆలోచించడం తగ్గిస్తారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు షార్ట్స్ ఎక్కువగా చూడకుండా జాగ్రత్త పడాలి.

దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పుస్తకం కొనుగోలు చేసి చదువుకోవచ్చు. లేదా స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేయాలి. షార్ట్స్ చూసే సమయంలో చెట్లకు నీరు పోయడం.. ఇతర ప్రాజెక్టులు చేయడం వంటివి మానసిక ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper