Homeఎంటర్టైన్మెంట్Jabardasth Praveen: జబర్దస్త్ ప్రవీణ్ కష్టం ఫలించింది.. పంట పండింది.. బ్యూటీఫుల్ వీడియో...

Jabardasth Praveen: జబర్దస్త్ ప్రవీణ్ కష్టం ఫలించింది.. పంట పండింది.. బ్యూటీఫుల్ వీడియో…

Jabardasth Praveen: బుల్లితెర మీద తన కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించిన కమెడియన్ పటాస్ ప్రవీణ్… గత ఏడాది మే నెలలో తను వంశిత ను పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు… ఇక ఇప్పుడు వంశిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన భర్త ప్రవీణ్ కి చెప్పిన వెంటనే ఆయన వంశిత ను హగ్ చేసుకుని ఎత్తుకున్నాడు. అలాగే తన ప్రెగ్నెన్సీ ని కన్ఫామ్ చేస్తూ […]

Jabardasth Praveen: బుల్లితెర మీద తన కామెడీ పంచులతో ప్రేక్షకులను అలరించిన కమెడియన్ పటాస్ ప్రవీణ్… గత ఏడాది మే నెలలో తను వంశిత ను పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు… ఇక ఇప్పుడు వంశిత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన భర్త ప్రవీణ్ కి చెప్పిన వెంటనే ఆయన వంశిత ను హగ్ చేసుకుని ఎత్తుకున్నాడు. అలాగే తన ప్రెగ్నెన్సీ ని కన్ఫామ్ చేస్తూ వంశిత ప్రెగ్నెన్సీ కిట్ ని తమ అభిమానులకు చూపిస్తూ ఒక ఫోటో అయితే షేర్ చేసింది. మొత్తానికైతే ప్రవీణ్ – వంశిత దంపతులు నూతన జీవితాన్ని మొదలుపెట్టిన తొందర్లోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం కూడా వాళ్ళకి రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.

అలాగే పలు ఈవెంట్లు చేస్తూ సినిమాల్లో కూడా అడపదడప నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ జంట ప్రస్తుతం చాలా సంతోషంగా తమ జీవితాన్ని లీడ్ చేస్తుండడం విశేషం… పటాస్ ప్రవీణ్ తన జీవితంలో ఏం జరిగినా కూడా తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు.

దాని ద్వారా ఆయన అభిమానులు కూడా ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో అలాంటి విషయాలను తమతో షేర్ చేసుకుంటానని గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటి ఇచ్చాడు. మొత్తానికైతే ఈ నూతన జంటను చూసిన ప్రతి ఒక్కరు వాళ్లకు విషెస్ ని తెలియజేస్తున్నారు.

అలాగే వీళ్లిద్దరు పేరెంట్స్ ఆబోతున్నారు కాబట్టి పేరెంట్స్ లక్షణాలు ఎలా ఉండాలనే విషయాల్లో కూడా కొంతమంది ప్రవీణ్ అభిమానులు అతనికి కొన్ని సలహాలు సూచనలను ఇస్తున్నారు. ప్రవీణ్ వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ మీరు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ పర్సనల్ లైఫ్ ను అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతానని ప్రవీణ్ చెబుతుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper