YS Jagan Mohan Reddy: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు తవ్వినాకొద్ది వెలుగు చూస్తూనే ఉన్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు అత్యంత దగ్గర వ్యక్తి ఇష్టానుసారంగా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడ్డారు.. ఆస్తులను సంపాదించారు. జల్సాలు చేశారు. అయితే ఆయన అక్రమ వ్యాపారం కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా ఏడు దేశాలకు విస్తరించింది.
నాడు వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ కు అత్యంత దగ్గర వ్యక్తి తన బావమరిది పేరుతో అమెరికాలో ఒక ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనిని మనీ రూటింగ్ కోసం వాడుకున్నారు. అందులో ఆ వ్యక్తి తన భార్య పేరుతో వాటా సొంతం చేసుకున్నారు. అనంతరం ఉగాండా దేశంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేశారు. అందులో తన భార్య పేరుతో వాట కూడా తీసుకున్నారు. జగన్ కు అప్పట్లో కోడి కత్తి గాయమైనప్పుడు.. వైద్యం చేసిన ఆసుపత్రి యజమాని తో కలిసి సదరు వ్యక్తి ఉగాండాలో ఫార్మా వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈడి విచారణలో ఇది బయటపడింది. థాయిలాండ్.. నేపాల్.. మలేషియా.. పిలిపిన్స్.. అజర్ బైజాన్ ప్రాంతంలో జగన్ కు దగ్గర వ్యక్తి వ్యాపారాలు చేసినట్టు తెలుస్తోంది. ఈడి దర్యాప్తులో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ దేశాలకు వెళ్ళింది.. ఎవరితో కలిసి వెళ్ళింది.. ఏ స్థాయిలో డబ్బులు బట్వాడా చేసింది అన్ని విషయాలను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సేకరించిన సమాచారం.
కడప జిల్లాకు చెందిన ఒక వ్యాపారి విజయవాడలో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారా హవాలా మార్గంలో ఈ నగదు మొత్తం వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులను ఈడి అధికారులు ఇప్పటికే సంప్రదించి రకరకాల సమాచారాల సేకరించారు. నాడు జగన్ తో ఫోటో తీయడానికి వచ్చే వారి దగ్గర నుంచి సదరు వ్యక్తి డబ్బులు వసూలు చేసేవారు. వైసీపీలో ఉన్న నాయకుల దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు. హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ లో ఒక టీవీ నటితో ఆ వ్యక్తి రాసలీలలు జరిపారు. పలువురు సినీ తారలతో కలిసి ఇతర దేశాలకు వెళ్లేవారు. సంఘ వ్యతిరేక యాప్స్ ప్రమోషన్ లో పాల్గొని.. వివాదంలో చిక్కుకున్న ఒక బుల్లితెర నటి తో పాటు.. మాల్దీవులకు వెళ్లిన మరో సినీ నటికి సైతం అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. నాడు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది ప్రవాహం కృష్ణలంక దగ్గరికి రాకుండా ఉండేందుకు అడ్డంగా గోడకట్టిన కాంట్రాక్టర్కు సంబంధించిన వ్యక్తులు ఆ టీవీ నటికి డబ్బులు చెల్లించినట్టు తెలుస్తోంది.