Homeఆంధ్రప్రదేశ్‌Rapthadu Incident: రాప్తాడు ఉన్మాదికి.. వైసిపి అండదండ.. ఇదిగో ఆధారాలు..

Rapthadu Incident: రాప్తాడు ఉన్మాదికి.. వైసిపి అండదండ.. ఇదిగో ఆధారాలు..

Rapthadu Incident: ఒకవైపు జగన్ ఏమంటాడంటే.. రాప్తాడులో ఆ బాలిక మీద దాడి జరగడానికి ప్రధాన కారణం టిడిపి.. బాలికల రక్షణ పట్టలేదు.. పైగా మద్యం.. మత్తు పదార్థాల లభ్యత పెరిగిపోయింది.. అందువల్లే పిల్లలు వాటికి అలవాటు పడి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆ కాడికి తన పరిపాలనలో మద్యం అమ్మనట్టు.. మత్తు పదార్థాలు లభించినట్టు తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. పైగా రాప్తాడు బాలిక కుటుంబానికి వైసీపీతో సంబంధం ఉందని.. తాను అధికారంలోకి రాగానే […]

Rapthadu Incident: ఒకవైపు జగన్ ఏమంటాడంటే.. రాప్తాడులో ఆ బాలిక మీద దాడి జరగడానికి ప్రధాన కారణం టిడిపి.. బాలికల రక్షణ పట్టలేదు.. పైగా మద్యం.. మత్తు పదార్థాల లభ్యత పెరిగిపోయింది.. అందువల్లే పిల్లలు వాటికి అలవాటు పడి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆ కాడికి తన పరిపాలనలో మద్యం అమ్మనట్టు.. మత్తు పదార్థాలు లభించినట్టు తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. పైగా రాప్తాడు బాలిక కుటుంబానికి వైసీపీతో సంబంధం ఉందని.. తాను అధికారంలోకి రాగానే బాలికకు 50 లక్షలు ఇస్తానని ప్రకటించాడు.. వాస్తవానికి ఇటువంటి ఘటనలో సెన్సిటివిటీ అనేది ఉంటుందని.. ఇందులో పాలిటిక్స్ చేయకూడదని.. కనీస స్పృహ జగన్ కు లేదు.

ఇక రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కు వైసిపి సపోర్ట్ ఇస్తోంది.. అది మామూలు కాదు.. ఏకంగా ఆ ఉన్మాదికి అనుకూలంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వైసిపి అనుకూల వ్యక్తి కోర్టులో వేశారు. ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా జగన్ పరామర్శకు వెళ్లారు. రాజకీయపరమైన విమర్శలు చేశారు. దేశం మొత్తం రాప్తాడులో బాలికపై జరిగిన దాడిని ఖండించింది. దానికి పాల్పడిన హేమంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేస్తోంది. కానీ అతడిని కాపాడేందుకు హైకోర్టులో వైసిపి లీగల్ సెల్ కు చెందిన గుండా గోపికృష్ణ పిల్ వేశారు. కేసును వాదించే బాధ్యతను అడ్వకేట్ సాల్మన్ రాజ్ తీసుకున్నారు. వైసిపి పరిపాలన కాలంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ గా సాల్మన్ రాజ్ అడ్వకేట్ గా పని చేశారు.

హేమంత్ మీద పోలీసులు కాల్పులకు పాల్పడిన నేపథ్యంలో.. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని వైసిపి పిల్ దాఖలు చేసింది. ఎందుకు కాల్పులు జరిపారు.. అతడిని ఎందుకు ఈడ్చుకుంటూ వచ్చారు.. సరైన వైద్య సహాయం ఎందుకు ఇవ్వలేదు.. సీసీ కెమెరా ఫుటేజ్.. మెడికల్ రిపోర్టులు ఇలా అన్ని వివరాలు పరిశీలించాలని వైసిపి న్యాయవాదులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఏపీ ప్రజల మొత్తం దుర్మార్గుడైన హేమంత్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కానీ అతడిని కాపాడేందుకు కాల్పుల కేసును సిబిఐ కి అప్పగించాలని జగన్ తరపు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు. ఉన్మాదులకు.. రౌడీలకు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన బృందాలకు వైసిపి అండగా ఉంటుందని.. గతంలో మత్తు పదార్థాల ముఠాను జగన్ పరామర్శించాలని ఈ సందర్భంగా టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అంతం చేసి.. డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అమాయకుడని నాడు జగన్ సపోర్ట్ చేశారు. గొర్రెల కాపరి దానయ్యను బండితో ఢీ కొట్టి అంతం చేసిన సిదిరి అప్పలరాజు కొడుకు అరవ్ చిన్నపిల్లడని జగన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్ల వ్యక్తిని ఢీ పప్పు చంపేస్తే తప్పేముందని జగన్ సపోర్ట్ ఇచ్చారు. అత్యాచారం కేసులు.. క్రూరమైన కేసులు ఉన్న సాయి కృష్ణ విషయాల్లో కూడా చిన్న పిల్లవాడు.. ఏదో తెలిసి తెలియక తప్పులు చేశాడని జగన్ వత్తాసు పలికారు. ఇప్పుడు రాప్తాడు ఘటనలో ప్రభుత్వం మీద జగన్ విమర్శలు చేశారు మరోవైపు ఉన్మాది హేమంత్ కు సపోర్టు ఇస్తూ.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయించారు. దీనినిబట్టి ఆ పార్టీ స్టాండ్ ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుందని టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper