Homeఆంధ్రప్రదేశ్‌YCP 9th List: వైసిపి తొమ్మిదో జాబితా విడుదల.. అనివార్యంగా విజయ సాయి పోటీ

YCP 9th List: వైసిపి తొమ్మిదో జాబితా విడుదల.. అనివార్యంగా విజయ సాయి పోటీ

YCP 9th List: ఇక మార్పులు లేవంటూనే వైసీపీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. అభ్యర్థులను మార్చుతూ ఆ పార్టీ తొమ్మిదో జాబితాను విడుదల చేసింది. పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయిన జగన్ ఇక్కడి నుంచి అభ్యర్థుల మార్పు ఉండబోదని.. ఎక్కడికక్కడే పేర్లు ప్రకటించని సిట్టింగులు, ఇన్చార్జులు ఎన్నికల బరిలో దిగుతారని తేల్చి చెప్పారు. అయితే అక్కడకి 24 గంటల వ్యవధిలోనే ఎనిమిదో జాబితాను విడుదల చేశారు. ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. దీంతో దాదాపు 75 మంది సిట్టింగ్లను మార్చినట్లు అయ్యింది.

వైసిపి హై కమాండ్ ఈ తొమ్మిదో జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. వై నాట్ 175 టార్గెట్ గా వైసీపీ ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. ఓడిపోయే అవకాశం ఉన్నవారిని జగన్ పక్కన పెడుతున్నారు. ఇదివరకు జాబితాలో పేర్లు ప్రకటించిన వారి సైతం మార్చుతుండడం విశేషం. అయితే తాజా జాబితాలో భారీ మార్పులు ప్రకటిస్తారని అంతా ఊహించారు. కానీ రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి మాత్రమే మార్పులు చేశారు. నెల్లూరు లోక్సభ ఇన్చార్జిగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయి రెడ్డి పేరును ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్య, కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జిగా ఏఎండి ఇంతియాజ్ లను ఖరారు చేశారు.

నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి బరిలో దిగడం అనివార్యంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జిగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్చార్జి నియామకంలో వేంరెడ్డిని కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి డిసైడ్ అయ్యారు. మరోవైపు విజయ్ సాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి పేరు వినిపించినా.. చివరకు విజయసాయి రెడ్డి వైపు మొగ్గు చూపారు. మరోవైపు టిడిపి అభ్యర్థిగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖరారు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే బలమైన అభ్యర్థిని బరిలోదించాల్సిన అనివార్య పరిస్థితి జగన్ పై పడింది. అందుకే విజయ్ సాయి రెడ్డి వైపు మొగ్గు చూపారు.

మరోవైపు మంగళగిరిలో సైతం అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలోనే తొలగించారు. గంజి చిరంజీవిని నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మంగళగిరిలో చిరంజీవి అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో.. ఆయన స్థానంలో మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం యూటర్న్ తీసుకున్నారు. ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నిర్ణయంతో గంజి చిరంజీవి ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యారు. ఈ తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper