spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Leaders ABN Andhrajyothy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి టచ్ లో వైసీపీ నేతలు

YSR Congress Leaders ABN Andhrajyothy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి టచ్ లో వైసీపీ నేతలు

YSR Congress Leaders ABN Andhrajyothy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై పెద్ద యుద్ధమే నడిపింది. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే ఆ పార్టీ శ్రేణులు వాటినే నమ్మేస్తాయి అంటూ.. కుటుంబ మహిళల విషయంలో కూడా వ్యాఖ్యానాలు సాగాయి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో.. దీంతో అక్కడి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. ఆ పార్టీ నేతలు హైదరాబాదులోని ఏబీఎన్ కార్యాలయం వద్దకు కూడా వెళ్లారు. అక్కడ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిపారు. అయితే ఇంత చేసిన తర్వాత కూడా చాలామంది వైసిపి నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ ప్రకారమే తాము నడుచుకున్నామని.. తమకు ఎలాంటి దురాభిప్రాయం లేదని ఏబీఎన్ జర్నలిస్టులతో పాటు యాజమాన్య ప్రతినిధుల వద్ద తమ గోడును వెల్లబోసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయిలో కూడా చాలామంది వైసిపి నేతలు ఏమిటి ఆందోళన అంటూ పెద్దగా పట్టించుకోలేదు కూడా.

Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

* ప్రత్యర్థి మీడియాతో సన్నిహితం..
వాస్తవానికి రాజకీయ పార్టీలు అన్నాక ప్రత్యర్థి పార్టీలతో స్నేహం.. ప్రత్యర్థి మీడియాతో టచ్ లో ఉండడం పరిపాటి. సొంత పార్టీలో ఉండే ప్రత్యర్థుల ఆట కట్టించేందుకు.. తమపై వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకోవడం కోసం ఇలా చాలా రకాలుగా ప్రత్యర్థి మీడియాతోనే ఎక్కువగా టచ్ లో ఉంటారు నేతలు. అది జిల్లాల్లో కూడా సర్వసాధారణం. సొంత పార్టీలో ఉండే ప్రత్యర్థులపై బురదజల్లేందుకు.. వారి అవినీతిని బయట పెట్టేందుకు ప్రత్యర్థి మీడియా అయితేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన వారు ఉంటారు. అటువంటివారు ప్రత్యేకంగా తమ పరిచయాలను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి ఆందోళనలు చేయవలసి వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అటువంటి ఇబ్బంది వైసీపీ నేతలకు వచ్చింది. అందుకే రాష్ట్రస్థాయి నేతలు సైతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది.

* వైయస్ కుటుంబ పరిణామాలపై..
జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదా? అంటే కచ్చితంగా తెలిసే ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరగబోయే పరిణామాలను ముందుగానే ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. ఇది చాలా సందర్భాల్లో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు ఉన్న వ్యక్తిగత, కుటుంబ వివాదాలను ముందుగా బయటపెట్టింది ఆంధ్రజ్యోతి. షర్మిల సొంత పార్టీ పెట్టుకుంటారని చెప్పింది కూడా ఆంధ్రజ్యోతి. అంతెందుకు విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటారని చెప్పింది ఆంధ్రజ్యోతి. అయితే ఈ సమాచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాకుండా ఆంధ్రజ్యోతి రాయగలదా? వైయస్ కుటుంబ సభ్యులు టచ్ లో లేనిది అంతటి సాహసం చేయగలరా? అసలు సమాచారం ఎలా బయటకు వచ్చింది? ప్రత్యర్థి మీడియాకు ఎలా అందింది? తాజా పరిస్థితుల నడుమ దీనిపైనే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఏ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారో.. అందులోనే కొందరు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి టచ్లోకి వెళ్లారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టచ్ లోకి వెళ్తారని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ అలా చేయాల్సిన అనివార్య పరిస్థితి.. చేయించాల్సిన అనివార్య పరిస్థితి ఆయనది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper