spot_img
Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ

Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premier league) లో భీకరమైన బ్యాటింగ్ తో ఆశేషమైన అభిమానులను సంపాదించుకొని.. ప్రేక్షకుల బలాన్ని సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) ఆటగాడు వైభవ్ సూర్య వంశీ (Vaibhav Surya vamshi). బెంగళూరు (RCB vs RR) తో శుక్రవారం రాత్రి గౌహతి(Guwahati cricket stadium) వేదికగా జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. బంతి ఎలా పడినా పట్టించుకోలేదు. స్టాండ్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అతడు బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.. ప్రారంభం నుంచి ఔట్ అయ్యేవరకు వైభవ్ ఒకే రీతిలో బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. సూర్య వంశీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హేజిల్ వుడ్ నుంచి మొదలు పెడితే డేవిడ్ వరకు ఏ బౌలర్ ని కూడా అతడు వదిలిపెట్టలేదు.. తనకు 15 సంవత్సరాల వయసు అనే విషయాన్ని పూర్తి అతడు మర్చిపోయాడు. పక్కా ప్రొఫెషనల్ ఆటగాడిగా బ్యాటింగ్ చేశాడు. బెంగళూరు పై సాధించిన విజయంలో సూర్య వంశీ కీలక పాత్ర పోషించాడు.

వైభవ్ ఇప్పుడు మాత్రమే కాకుండా అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా సత్తా చూపించాడు. టీమిండియా ట్రోఫీ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. సూర్య వంశీ స్థిరంగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి త్వరలో జాతీయ జట్టులో చోటు లభించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు అనధికారికంగా సంకేతాలు ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే కనక జరిగితే అత్యంత చిన్నప్రాయంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు సూర్య వంశీ.

బలమైన రిస్ట్ హ్యాండ్ షాట్ లు ఆడటంలో సూర్య వంశీ తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఒకప్పుడు వేగంగా ఆడే క్రమంలో వికెట్ కోల్పోయేవాడు. కానీ గత మూడు మ్యాచ్ లలో అతడి స్థిరత్వం కనిపిస్తోంది. టెక్నిక్ కనిపిస్తోంది. అందువల్లే మేనేజ్మెంట్ అతడికి జాతీయ జట్టులో చోటు కల్పించబోతోందని వార్తలు వస్తున్నాయి. జూన్ లో జరిగే ఆఫ్గనిస్తాన్ సిరీస్ కోసం అతడు ఆడతాడని.. జాతీయ జట్టులో మెరుస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరి కొద్ది రోజుల్లో అధికారికంగా స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper