Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan And Sharmila: షర్మిలతో రాజీ చేసుకుంటేనే జగన్ కు మంచిది

YS Jagan And Sharmila: షర్మిలతో రాజీ చేసుకుంటేనే జగన్ కు మంచిది

YS Jagan And Sharmila: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తన సోదరి షర్మిల తో సంధి చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆమె ఉండగా జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే షర్మిల అస్సలు తగ్గడం లేదు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. కానీ నువ్వు నీ కామెడీ అంటూ.. ఏకంగా షర్మిల జగన్మోహన్ రెడ్డిని […]

YS Jagan And Sharmila: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )తన సోదరి షర్మిల తో సంధి చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఆమె ఉండగా జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే షర్మిల అస్సలు తగ్గడం లేదు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. కానీ నువ్వు నీ కామెడీ అంటూ.. ఏకంగా షర్మిల జగన్మోహన్ రెడ్డిని మావిగన్ జోకర్ గా తేల్చేశారు. మావిగన్ అంత గొప్పదైతే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని షర్మిల ప్రశ్నించారు. మూడు ఊర్ల పేర్లను పెట్టి మావిగన్ అని పెట్టినట్లు.. పులివెందులకు అవిగొడ్డలి అని పేరు పెట్టాలని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. మొన్నటికి మొన్న తమ కుటుంబ వ్యవహారాలపై మాట్లాడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వారిని.. ఏకంగా కుక్కలతో పోల్చారు.

Also Read: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

* బొత్స పై విమర్శలు..
తాజాగా బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియా ముందు ఏడ్చిన తీరుపై కూడా స్పందించారు. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టంట్ అన్నట్టు మాట్లాడారు. బొత్స ఎందుకు ఏడ్చారో ఆయనకే తెలియాలి అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని బొత్స అత్యంత ఘోరంగా తూలనాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఏకంగా అప్పట్లో అసెంబ్లీలోనే వైయస్ పై చేసిన వ్యాఖ్యలతో విజయం మా కంటతడి పెట్టుకున్నారని ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన వైయస్ పై ఏదో అభిమానం ఉందన్నట్టుగా కంటతడి పెట్టుకోవడం పై షర్మిల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా షర్మిల తగ్గేదేలే అంటూ గట్టిగానే చెప్పుకొస్తున్నారు.

* సెటైరికల్ స్పందన
అయితే షర్మిల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కనీసం స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడుతున్నారు. మొన్న మధ్యన వైసీపీ నేతలపై తన కుక్క వ్యాఖ్యలను సెటైరికల్ గా సమర్ధించుకున్నారు. అమ్మ షర్మిలమ్మ.. వైసీపీ నేతలను కుక్కలతో పోల్చదమ్మ.. అవి వింటే కుక్కలు బాధపడతాయి అమ్మ అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పై పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు అని ఆమె నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నారు. జగన్ పాలసీల విషయంలో కూడా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు షర్మిలను హ్యాండిల్ చేయడం వైసిపి పురుషనేతలకు వీలుపడడం లేదు. అందుకే మహిళా నేతలు తెరపైకి వస్తున్నారు. షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper