spot_img
Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక...

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. వరల్డ్ క్రికెట్ సెన్సేషన్ ఊరికే అవలేదు.. దాని వెనుక కన్నీళ్లు పెట్టించే త్యాగం

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. బుద్ధిగా స్కూల్ కి వెళ్తారు. స్కూల్ ముగిసిన తర్వాత హోంవర్క్ చేసుకుంటారు. అది పూర్తి అయిన తర్వాత స్నేహితులతో ఆడుకుంటారు. సరదాగా టీవీ చూస్తారు. తల్లిదండ్రులతో కబుర్లు చెబుతారు. తోబుట్టువులతో ఆటలాడుకుంటారు. కానీ వైభవ్ సూర్య వంశీ పూర్తి డిఫరెంట్.

Also Read: దౌత్యం పేరుతో దళారీగా మారిన పాకిస్తాన్‌.. శాంతి చర్చలను బహిష్కరించిన ఇరాన్‌!

అతనికి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. కాకపోతే ఆర్థిక నేపథ్యం సహకరించేది కాదు. అయినప్పటికీ సూర్య వంశీ ఆసక్తిని గమనించిన తండ్రి తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని క్రికెట్ మైదానంగా మార్చాడు. కొడుకు కోసం తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టాడు. అతడిలో ఉన్న క్రికెటర్ ను చూసి మురిసిపోయేవాడు. అతడు ఆడుతుంటే ఆనందించేవాడు.. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో వైభవ్ సూర్య వంశీ మరింత రాటు తేలాడు. బీహార్ క్రికెట్ జట్టులో చేరి.. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు.. ఫలితంగా అతడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది. దీంతో అతడి గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. అతనికోసం ఢిల్లీ జట్టు కూడా తీవ్రంగా పోటీ పడింది. చివరికి రాజస్థాన్ జట్టు సొంతం చేసుకుంది. ద్రావిడ్ శిక్షణలో సూర్య వంశీ అత్యుత్తమ టెక్నిక్ నేర్చుకున్నాడు. కాకపోతే అతడి బరువు విపరీతమైన సమస్యగా ఉండేది. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడంలో అతడు ఇబ్బంది పడేవాడు. చివరికి అతడి లోపం గురించి ద్రావిడ్ చెప్పడంతో.. దానిని సవరించుకునే పని మొదలుపెట్టాడు. చివరికి వైభవ్ సరి కొత్తగా కనిపించాడు.

వైభవ్ సూర్య వంశీ కి మటన్ అంటే చాలా ఇష్టం. పానీ పూరి కూడా ఇష్టంగా తింటాడు. అవసరమైతే కొన్ని సందర్భాలలో వందకు మించి పానీపూరీలు లాగించేవాడు. దాదాపు అర కిలో మటన్ తినేసేవాడు. చంపారన్ స్టైల్ లో చేసే మటన్ కూరను అతడు విపరీతంగా ఇష్టపడేవాడు.. ఎప్పుడైతే మటన్ ను దూరం పెట్టడం మొదలు పెట్టాడో .. పానీ పూరిని అవాయిడ్ చేశాడో.. వైభవ్ బరువు తగ్గాడు. డైట్ కంట్రోల్ లో ఉంచుకున్నాక బ్యాటింగ్ మీద మరింత దృష్టి పెట్టాడు. లోపాలను పూర్తిగా సవరించుకున్నాడు. ఫలితంగా అత్యుత్తమ ఆటగాడిగా కనిపిస్తున్నాడు

” మా కుమారుడు మటన్ ఇష్టంగా తినేవాడు. పానీ పూరి కూడా లాగించేవాడు. ద్రావిడ్ సార్ చెప్పిన తర్వాత డైట్ కంట్రోల్ లో పెట్టుకున్నాడు. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాడు. సెలెక్టెడ్ షాట్లు ఆడుతున్నాడు. అతని ఆట ఎలా మారిందో మీరు ఇప్పుడు గమనించవచ్చని” సూర్య వంశీ తండ్రి చెప్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Oktelugu Epaper